క్రికెట్ అంటే డబ్బు కాదు..ఒక మతం: గంగూలీ - Telugu News - Mic tv
mictv telugu

క్రికెట్ అంటే డబ్బు కాదు..ఒక మతం: గంగూలీ

June 15, 2022

”క్రికెట్ ఎప్పుడు డబ్బుకు సంబంధించినది కాదు. ఇది ప్రతిభకు సంబంధించినది. మన దేశంలో క్రికెట్ ఎంత బలంగా ఉందో, మీడియా హక్కుల వేలంలోనే తేలింది. యువ ఆటగాళ్లందరికీ వారి సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి, టీమ్ ఇండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి, వేలంలో పలికిన భారీ ధరలు అతి పెద్ద ప్రేరణగా ఉండాలి. ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. మన దేశంలో క్రికెట్ ఒక మతం. గత 50 ఏళ్లలో ఆటకు ఆదరణ తీసుకు వచ్చిన ఆటగాళ్లకు, నిర్వాహకులకు అభినందనలు. క్రికెట్‌కు అంతగా ఆదరణ లేనప్పుడు పెద్ద సంఖ్యలో స్టేడియాలకు వెళ్లి, టీవీల ముందు కూర్చుని మ్యాచ్‌లు వీక్షించిన అభిమానులకు, మద్దతుదారులకు నా ప్రత్యేక శుభాకాంక్షలు” అని బీసీసీఐ అధ్యక్షుడుసౌరబ్ గంగూలీ అన్నారు.

భారత టీ20 లీగ్‌లో రాబోయే ఐదేండ్ల కాలానికి (2023 నుంచి 2027) మీడియా ప్రసార హక్కుల వేలంపాట మంగళవారం ముగిసిన విషయం తెలిసిందే. ఈ హక్కులను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ. 48.300 కోట్లు ఆర్జించింది. దీంతో టీ20 లీగ్, ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన లీగ్‌గా ఎదిగింది. ఈ ఆదాయంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ సంతోషం వ్యక్తం చేస్తూ, మీడియాతో మాట్లాడాడు.

ఇక, టీ20 మీడియా హక్కుల్లో ఉపఖండపు టీవీ ప్రసార హక్కులను డిస్నీ స్టార్ రూ.28,575 కోట్లకు (మ్యాచ్‌కు రూ.57.5 కోట్లు) సొంతం చేసుకుంది. తీవ్ర పోటీ మధ్య ఇండియా డిజిటిల్ హక్కులను రిలయన్స్ భాగస్వామిగా ఉన్న వయాకామ్ 18 రూ. 20,500 కోట్లకు దక్కించుకుంది. నాన్-ఎ క్లూజివ్ ప్యాకేజీ డిని కూడా వయాకామ్ 18 రూ.3257.5 కోట్లకు సొంతం చేసుకుంది. (ప్యాకేజీ డిని అరెస్టాఫ్ వరల్, టీవీ- డిజిటల్) రూ. 1058 కోట్లకు వయాకామ్ 18, టైమ్స్ ఇంటర్నెట్ దక్కించుకుంది.