గల్లీ క్రికెట్ గొడవ.. కత్తితో యువతి హత్య - MicTv.in - Telugu News
mictv telugu

గల్లీ క్రికెట్ గొడవ.. కత్తితో యువతి హత్య

June 29, 2020

Cricket Issue in Two Families Tamilnadu  

చిన్నపాటి క్రికెట్ గొడవ రెండు కుటుంబాల మధ్య వివాదం రేపింది. ఘర్షణ పడి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే స్థాయికి వెళ్లడంతో ఓ యువతి ప్రాణాలను కోల్పోయింది. తమిళనాడులోని తంజావూరు జిల్లా కార్కవాయల్‌ గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. 

శక్తివేల్‌ అనే వ్యక్తి కొడుకు వసంతసేనన్‌ (19) పక్క ఇంట్లో ఉన్న కుబేంద్రన్‌ కొడుకు గురు ప్రభుతో కలిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లారు. ఆట మధ్యలో వీరికి వివాదం తలెత్తింది. దీంతో కోపంలో వసంత్ పై గురు ప్రభు దాడి చేశాడు. విషయాన్ని ఆ బాలుడు ఇంటికి వచ్చి తన అక్కలకు చెప్పాడు. వెంటనే అతని అక్కలు షణ్ముగప్రియ (24), కౌసల్య (23), సత్య (22), ఫౌసియా (21) కుబేంద్రన్‌ ఇంటికి వెళ్లారు. తమ తమ్ముడిని ఎందుకు కొట్టావంటూ నిలదీశారు. ఇది కాస్త పెద్దది కావడంతో  రెండు కుటుంబాలకు చెందిన వారు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో గురు ప్రసాద్ కుటుంబ సభ్యులు  కత్తులతో నలుగురు యువతులపై దాడిచేశారు. ఈ దాడిలో షణ్ముగప్రియ మరణించింది. మిగిలిన వారు గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు.  గురుప్రభు తో పాటు తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.