గ్రౌండ్ లోనే కాదు బయట కూడా క్రికెటర్లు అదిరిపోయే స్టెప్పులు వేస్తున్నారు. హైదరాబాద్ సన్ రైజర్స్ టీం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో అదిరిపోయే ఫెర్మామెన్స్ ఇచ్చింది. చిరు 150వ చిత్రంలోని అమ్మడు .. లెట్స్ డు కుమ్ముడు పాటకి హెన్సిక్స్ వేసిన స్టెప్స్ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆ తర్వాత శిఖర్ దావన్ సల్మాన్ పాటకి డ్యాన్స్ చేయగా, పవన్ పాటకి విలియమ్ సన్ , రణబీర్ కపూర్ పాటకి భువనేశ్వర్ కుమార్, అల్లు అర్జున్ పాటకి మెక్ గ్లీన్ స్టెప్పులేశారు. చివరిగా ఆర్జేస్ తో పాటు క్రికెటర్స్ అందరు గురు సినిమాలోని జింగిడి జింగిడీ పాటకు గమ్మతైన స్టెప్పులు వేసి ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.