క్రికెట్ లో రోజుకో టెన్నాలజీ ప్రవేశపెడుతున్నాడు. ఈ సారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ఎన్నడూ వాడని టెక్నాలజీని వాడుతున్నారు. అడ్వాన్స్డ్ పిచ్ రిపోర్ట్‌ల కోసం డ్రోన్లు, బ్యాట్ స్వింగ్ తెలుసుకునేందుకు బ్యాట్ సెన్సర్లు ఉపయోగిస్తున్నారు.
ఇంటెల్ ఫాల్కన్ 8 డ్రోన్ సాయంతో ఈసారి అడ్వాన్స్డ్ పిచ్ రిపోర్ట్ అందిస్తారు. ఈ డ్రోన్‌లో హైడెఫనెషన్, ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయి. దీని సాయంతో పిచ్ గురించి మరింత స్పష్టంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ డ్రోన్ అందించే ఫొటోలతో పిచ్‌పై ఉన్న పచ్చిక, పగుళ్లు, తేమలాంటి విషయాలను నిపుణులు మరింత మెరుగ్గా అంచనా వేస్తారు. ఇంటెల్ క్యూరీ టెక్నాలజీ సాయంతో బ్యాట్లలో సెన్సర్లు అమర్చనున్నారు. బ్యాట్స్‌మెన్ ఆడే ప్రతి షాట్‌కు సంబంధించిన విశ్లేషణను ఈ సెన్సర్ల కారణంగా మరింత మెరుగ్గా చేసే చాన్స్ ఉంటుంది. ప్రతి షాట్లో బ్యాక్ లిఫ్ట్, బ్యాట్ స్పీడ్, ఫాలో త్రూలాంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. కొందరు బ్యాట్స్‌మెన్ వాడే బ్యాట్లలో ఈ సెన్సర్లు అమరుస్తారు. ఇక ఈ టోర్నీలో అభిమానులకు వర్చువల్ రియాలిటీ (వీఆర్) ఎక్స్పీరియన్స్ ను ఇంటెల్ అందించనుంది. ద ఓవల్, ఎడ్బాస్టన్ స్టేడియాల దగ్గర ఈ అవకాశాన్ని కల్పించారు. హెడ్ మౌంటెడ్ డిస్ప్లే సాయంతో ఏ అభిమాని అయినా వర్చువల్ బౌలర్‌ను ఎదుర్కొంటూ తమ బ్యాటింగ్‌ను మెరుగు పరచుకొనే అవకాశం ఉంటుంది.