Home > క్రికెట్ > క్రికెటర్ అర్షదీప్ సింగ్ కు ‘ఖలిస్థానీ’తో లింక్.. కేంద్రం సమన్లు

క్రికెటర్ అర్షదీప్ సింగ్ కు ‘ఖలిస్థానీ’తో లింక్.. కేంద్రం సమన్లు

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో కీలక క్యాచ్ వదిలిపెట్టిన క్రికెటర్ అర్షదీప్‌పై క్రికెట్ అభిమానుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ట్రోల్ చేయగా, ఇప్పుడు మరింత ముందడుగు వేసి ఏకంగా ఖలిస్తాన్‌ ఎలిమెంట్ అంటగట్టే ప్రయత్నం చేశారు. అందుకు సంబంధించిన సమాచారం వికీపీడియాలో వెలుగు చూసింది. క్రికెటర్ పేరు మీద ఉన్న పేజీలో ఖలిస్తాన్ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడనే సమాచారాన్ని ఎవరో యూజర్ ఎడిట్ చేసి పెట్టాడు. దీంతో సమాజంలో సామరస్యం దెబ్బతింటుందని, అతడి కుటుంబానికి ముప్పు ఏర్పడుతుందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాక, వికిపీడియా భారత ఎగ్జిక్యూటివ్‌లకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సమన్లు జారీ చేసింది. దాంతో వారు స్పందించి వెంటనే సమాచారాన్ని సరి చేశారు. కాగా, వికీపీడియా అనేది ఉచిత సమాచార వేదిక. ఇందులో ఎవరైనా లాగిన్ అయి అదనపు సమాచారాన్ని జోడించడం, లేదా తొలగించడం చేయవచ్చు. కనుక పై విధంగా ఎడిట్ చేసిన వారిని వారి లాగిన్ ఐడీ ఆధారంగా గుర్తించే అవకాశముంది.

Updated : 5 Sep 2022 3:46 AM GMT
Tags:    
Next Story
Share it
Top