న్యూజిలాండ్‌తో వన్టే సిరీస్‌కు టీమ్ఇండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న శిఖర్ ధావన్.. సహచర క్రికెటర్ చాహల్‌పై జోకులు వేశాడు. అతని భార్య ధనశ్రీ చాహల్‌ని కూలీ గా మార్చిందంటూ సెటైర్లు వేశాడు. వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్ లో భాగంగా టీమ్ఇండియా.. అందుకు సిద్ధమవుతోంది. ఫస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓడగా.. సెకండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేయాలనుకుంటోంది టీమిండియా. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న మ్యాచ్ కోసం టీమిండియా క్రికెటర్స్ తమ భార్యలను వెంటబెట్టుకొని క్రైస్ట్‌చర్చ్‌కు పయనమయ్యారు. ఈ సందర్భంగా కెప్టెన్ శిఖర్ ధావన్ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. విమానాశ్రయం దగ్గర లగేజ్‌ను రెండు చేతులతో తీసుకువస్తున్న చాహల్‌ను చూపుతూ సరదా వ్యాఖ్యలు చేశాడు. అతడి వెనకే తక్కువ లగేజీతో వస్తున్న చాహల్ భార్య ధనశ్రీ వర్మను ఆటపట్టిస్తూ.. అప్పుడే భర్తను కూలీని చేసేసిందంటూ నవ్వులు పూయించాడు.
అయితే ఇటీవల చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని సోషల్ మీడియాలో పుకార్లు పుట్టించారు కొందరు. అందుకు కారణంగా ఇన్ స్టాలో చాహల్ పోస్ట్‌ను చూపించారు. చాహల్ పెట్టిన పోస్ట్‌లో ‘కొత్త జీవితం మొదలవుతోంది’ అని రాసి ఉండగా.. అదే సమయంలో ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాహల్ పేరును తొలగించింది. దీంతో విడాకులు తీసుకోబోతుండటం పక్కా అని.. నిర్ధారించారు. కానీ నిజానికి చాహల్ పోస్ట్ కంటే ముందే ఆమె తన పేరులో నుంచి చాహల్ పదాన్ని తొలగించింది. ఇది తెలియని వారంతా విడాకులు ఖాయమని యూట్యూబ్, వెబ్ సైట్లలో పోస్ట్‌ల వర్షం కురిపించారు. వీటన్నంటిని ఖండిస్తూ.. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో.. అవన్నీ రూమర్లేనని.. ఎవరూ నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. ‘‘మా రిలేషన్‌షిప్‌కు సంబంధించి ఎలాంటి రూమర్లూ నమ్మొద్దని మీ అందరికీ వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి వీటికి ముగింపు పలకండి’’ విడాకుల చర్చకు ఫుల్స్టాప్ పెట్టాడు. చాహల్ , ధనశ్రీ లు డిసెంబర్ 2020లో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.