హన్మకొండలో క్రికెటర్‌ హనుమ విహారి పెళ్లి.. - MicTv.in - Telugu News
mictv telugu

హన్మకొండలో క్రికెటర్‌ హనుమ విహారి పెళ్లి..

May 19, 2019

Cricketer Hanuma Vihari Marriage At Warangal District Hanamkonda.

భారత యువ క్రికెటర్ హనుమ విహరి, ప్రీతిరాజ్‌ మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆదివారం హన్మకొండ హంటర్ రోడ్డులోని కోడెం కన్వెన్షన్ హాలులో వీరిద్దరి వివాహం అంగరంగవైభవంగా జరిగింది.

హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వరంగల్‌కు చెందిన ప్రీతిరాజ్‌ తొలిసారి కలుసుకున్నారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి.. అనంతరం ఇరు కుటుంబాల అంగీకారంతో గతేడాది ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. 2018 సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన విహారి.. మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.