హర్భజన్ సింగ్ హీరోగా 'ఫ్రెండ్‌షిప్' మూవీ.. - MicTv.in - Telugu News
mictv telugu

హర్భజన్ సింగ్ హీరోగా ‘ఫ్రెండ్‌షిప్’ మూవీ..

February 3, 2020

hari01

టీమిండియా మాజీ బౌలర్‌ హర్భజన్‌ సింగ్‌ నటుడిగా అవతారమెత్తనున్నారు. షండో స్టూడియో అండ్‌ సినిమాస్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న తమిళ చిత్రంలో హర్భజన్‌సింగ్‌ హీరోగా నటిస్తున్నారు. దీనికి జేపీఆర్‌-శ్యామ్‌ సూర్యలు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ దర్శక ద్వయం ఇంతకు ముందు అగ్నిదేవి అనే చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా హర్భజన్‌సింగ్‌ హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘ఫ్రెండ్‌షిప్‌’ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హర్భజన్‌సింగ్‌ ఆదివారం విడుదల చేశారు. కాగా, ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, ఇతర సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది. సంకెళ్లు వేయబడ్డ రెండు చేతులు మాత్రమే కలిగిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇదేదో ఖైదీలకు సంబంధించిన కథాంశంతో కూడిన చిత్రమా అని అంచనాకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా భారతీయ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు.