పుకార్లకు చెక్.. ఘనంగా క్రికెటర్ రాహుల్ పెళ్లి - Telugu News - Mic tv
mictv telugu

పుకార్లకు చెక్.. ఘనంగా క్రికెటర్ రాహుల్ పెళ్లి

November 25, 2022

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఓపెనర్ గా ప్రత్యర్థి బౌలర్లపై విధ్వసం సృష్టించే రాహుల్ తన ప్రేయసికి లాక్ అయిపోబోతున్నాడు. రాహుల్ కి కాబోయే వైఫ్ ఎవరో కాదు. బాలీవుడ్ నటి అథియా శెట్టి. వీరిద్దరూ ఈ ఏడాది చివరిలో లేదా జనవరి మొదటి వారంలో పెళ్లి చేసుకోనున్నారు. నటి అథియా శెట్టి బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సునీల్ శెట్టి కూతురు. వీరిద్దరి వివాహాన్ని తాజాగా ధ్రువీకరించారు సునీల్ శెట్టి. అతియా, రాహుల్‌ల పెళ్లి గురించి మీడియా సునీల్‌ను అడిగినప్పుడు.. అతి త్వరలో జరుగుతుందని ధృవీకరించారు. వివాహాన్ని ప్లాన్ చేయడానికి అతియా, రాహుల్ ఇద్దరి షెడ్యూల్‌లను పరిగణనలోకి తీసుకోవాలి కాబట్టి సాధ్యమయ్యే తేదీలను చూస్తున్నట్లు శెట్టి వెల్లడించాడు.

“పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందో త్వరలో మీకందరికీ తెలుస్తుందని ఆశిస్తున్నా” అని సునీల్ ఒక ఇంటర్వ్యూలో తొలిసారి కూతురి వివాహంపై ఓపెన్ అయ్యాడు.
సునీల్ శెట్టి మాట్లాడుతూ.. “సరైన సమయంలో అందరికీ పెళ్లి గురించిన వివరాలు తెలుస్తాయని నేను అనుకుంటున్నా ” అని క్లారిటీ ఇచ్చాడు. అయితే కొన్నాళ్లుగా వస్తున్న పెళ్లి పుకార్లపై నటి అతియా సైతం తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో స్పందిస్తూ, “మూడు నెలల్లో జరిగే ఈ వివాహానికి మీరు నన్ను ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను, lol” అని సెటైర్స్ వేసింది. ఇంతలోనే తండ్రి సునీల్ శెట్టి కూతురి పెళ్లి పుకార్లపై అధికారిక ప్రకటన చేయనున్నట్టు తెలిపాడు. రాహుల్, అతియా వివాహం ముంబైలోని ఫైవ్ స్టార్ హోటల్‌లో లేదా ఖండాలాలోని సునీల్ శెట్టి నివాసంలో జరిగే అవకాశాలున్నాయి. ఇక సునీల్ శెట్టి ఇంట్లో అలంకరణలు, ఇతర ఏర్పాట్లను పూర్తి చేయడానికి ముంబైలోని ప్రముఖ వివాహ నిర్వాహకుడు కసరత్తు చేస్తూ కనిపించినట్లు సమాచారం.