అయోధ్యపై షమీ భార్య పోస్ట్.. రేప్ చేసి చంపేస్తామని కాల్స్  - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్యపై షమీ భార్య పోస్ట్.. రేప్ చేసి చంపేస్తామని కాల్స్ 

August 10, 2020

cricketer mohammed shami wife getting threats

ఆగస్టు 5న అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా ఎందరో సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు దేశవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీ భార్య హసీన్ జహాన్‌ ఒకరు. ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా దేశ ప్రజలకు రామమందిర భూమి పూజ శుభాకాంక్షలు తెలిపారు. 

 

దీంతో అప్పటినుంచి ఆమెకు సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు వస్తున్నాయని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్యలో భూమిపూజ సందర్భంగా హిందూ సోదరీసోదరులకు శుభాకాంక్షలు తెలిపినందుకు కొందరు ఛాందసవాదులు తనను సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని ఆమె ఫిర్యాలులో తెలిపారు. రేప్ చేసి చంపేస్తామంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్నారని.. అసభ్య పద జాలంతో దూషిస్తూ తనను వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను తీవ్ర మానసిక కుంగుబాటుకు గురికావాల్సి ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు.