Cricketer Mohammed Siraj Tweets About Missing Baggage in flight
mictv telugu

మొన్న దీపక్ చాహర్, నేడు సిరాజ్..విమాన ప్రయాణాల్లో చేదు అనుభవాలు..

December 28, 2022

మొన్న దీపక్ చాహర్, నేడు సిరాజ్..బంగ్లాదేశ్ టూర్‎కు వెళ్లేటప్పుడు ఒకరికి…తిరుగు ప్రయాణంలో మరొకరికి విమానయాన సంస్థల ద్వారా చేదు అనుభవం ఎదురైంది. బంగ్లా పర్యటనను ముగించుకుని ఇండియాకు వచ్చిన భారత్ పేస్ బౌలర సిరాజ్ బ్యాగ్ కనిపించకుండా పోయింది. ఢాకా నుంచి ముంబైకి విస్తారా విమానంలో మంగళవారం ముంబై చేరుకున్నాడు. తర్వాత తన లగేజ్‎లోని మూడు బ్యాగ్‌లలో రెండింటిని మాత్రమే విమాన సిబ్బంది ఎయిర్ పోర్ట్‎లో అందించారు. మరో బ్యాగ్ పై సమాచరం ఇవ్వలేదు. అడిగితే తెచ్చిస్తామని చెప్పారే తప్ప బ్యాగు అందించలేదు. దీంతో సిరాజ్ అసహానికి గురవుతూ మంగళవారం ట్వీట్ చేశాడు. బ్యాగ్‎లో చాలా విలువైన వస్తువులు ఉన్నాయని, వీలైనంత త్వరగా హైదరాబాద్ చేరవేయాలని కోరాడు. దీంతో విస్తారా విమానం అలర్ట్ అయ్యింది. అతని బ్యాగ్‌ను గుర్తించి సమాచారమందించింది. తన బ్యాగ్ ఎక్కడుందో గుర్తించారని బుధవారం ట్విట్టర్ ద్వారా సిరాజ్ తెలిపాడు. ఇదే బంగ్లాదేశ పర్యటనకు వెళ్తున్న సమయంలో భారత్ మరో బౌలర్ దీపక్ చాహర్ బ్యాగ్‎ను కూడా మలేషియా ఎయిర్ లైన్స్ మిస్ చేసింది.