సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోనీ..(వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోనీ..(వీడియో)

February 27, 2020

dhoni

టీంఇండియా మాజీ సారధి ధోనీ గత కొంతకాలంగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. 2019 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచే ధోనీకి చివరి మ్యాచ్. ఆ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ ధోనీ ఆడలేదు. ప్రపంచకప్ తర్వాత రెండు నెలల పాటు ఇండియన్ ఆర్మీకి సేవలు అందించాడు. 

Start of organic farming of watermelon in Ranchi followed by papaya in 20 days time.first time so very excited.

Publiée par MS Dhoni sur Mercredi 26 février 2020

తాజాగా ధోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. రాంచీలోని తన వ్యవసాయక్షేత్రంలో పుచ్చ కాయలు, బొప్పాయి పంటని పండిస్తున్నాడు. బొప్పాయి తర్వాత తొలిసారి పుచ్చకాయ పంటను సేంద్రీయ పద్దతితో పండిస్తున్నానని ధోనీ వీడియోలో తెలిపారు. ఈ వీడియోపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధోనీ ఐపీఎల్‌ టోర్నీతో మళ్ళీ బ్యాట్ పట్టనున్నాడు. ఆ టోర్నీ కోసం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.