పుట్టపర్తిలో టీమిండియా మాజీ సారథి ధోని - MicTv.in - Telugu News
mictv telugu

పుట్టపర్తిలో టీమిండియా మాజీ సారథి ధోని

February 11, 2020

Dhoni

టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోని మంగళవారం అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని సత్యసాయి బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి వచ్చిన ధోనికి సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వ్యక్తిగత వైద్యుడు ముత్తు కోసం అతడు పుట్టపర్తి వచ్చాడు. పుట్టపర్తి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ముత్తు విజిటింగ్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నారు. 

ఈ సందర్భంగా ధోని పుట్టపర్తిలోని హిల్‌ వ్యూ స్టేడియాన్ని పరిశీలించారు. తర్వాత పుట్టపర్తి హాస్పిటల్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ధోనీ మట్లాడుతూ..’నా వ్యక్తిగత డాక్టర్‌ పుట్టపర్తిలో ఉండటంతో వైద్య పరీక్షల నిమిత్తం పుట్టపర్తికి వచ్చాను. సత్యసాయిబాబా చేపట్టిన సేవా కార్యక్రమాలు ఎంతో మందికి స్ఫూర్తినిస్థాయ.’ అని ధోనీ అన్నారు.