ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ ముంబై బాంద్రాలోని ఓ అపార్ట్మెంట్లో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశాడు. కేసీ రోడ్డులోని రూ. 10.50 కోట్లు పెట్టి ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంటులో ఎనిమిదవ అంతస్తులో ఫ్లాటు కొన్నాడు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. 2209 ఫీట్ల కార్పెట్ ఏరియా, 1654 ఫీట్ల టెర్రస్లతో అత్యంత విశాలంగా ఉండే ఈ ఫ్లాటుని పిరమిడ్ డెవలపర్స్, అల్ట్రాస్పేస్ సంయుక్తంగా నిర్మించాయి.
దీంతోపాటు మూడు కార్లకు పార్కింగ్ సౌకర్యం ఉంటుంది. స్టాంపు డ్యూటీ రూ. 52.50 లక్షలు కాగా, ఏప్రిల్ 28న పృథ్వీ షా పేరున ప్రాపర్టీ రిజిస్టర్ అయింది. కాగా, 2018లో ఐపీఎల్ కెరీర్ మొదలుపెట్టిన షా.. మూడేళ్ల కాలానికి రూ. 1.20 కోట్లకు ఢిల్లీ తరపున ఆడాడు. గత ఐపీఎల్లో బాగా రాణించడంతో ఈ ఏడాది ఢిల్లీ జట్టు మేనేజ్మెంట్ వేలానికి ముందే రూ. 7.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.