Cricketer pulls off incredible and unlikely catch off own bowling
mictv telugu

ఈ క్యాచ్.. నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్..

June 17, 2022

Cricketer pulls off incredible and unlikely catch off own bowling
క్రికెట్‌లో ఎన్నో అద్భుతమైన సంఘటనలు, ఔరా అని నోరెళ్లబెట్టే సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంక ఫీల్డింగ్ విషయానికి వస్తే.. ఎన్నో అద్భుతమైన బౌండరీ సేవ్‌లను, ఎన్నో గ్రేట్‌ క్యాచ్‌లను చూశాం. ఇప్పుడు చెప్పుకోబోయే క్యాచ్‌ గురించి మాత్రం మీరు ఇంతకుముందెన్నడూ విని ఉండరు, చూసి ఉండరు. ఇంగ్లాండ్ లోని అల్‌డ్విక్ క్రికెట్ క్లబ్, లింగ్‌ఫీల్డ్‌ క్రికెట్ క్లబ్ మధ్య జరిగిన మ్యాచ్‌ లో ఈ అద్భుతం ఆవిష్కృతమైంది. క్యాచ్‌ మిస్‌ చేసిన ఫీల్డర్‌ మళ్లీ తేరుకుని ఆ క్యాచ్‌ ఒడిసిపట్టుకుని బ్యాటర్ ను పెవిలియన్ కు పంపాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండానే.. బ్యాట్స్‌ మన్‌ వెనక్కివెళ్లిపోయాడు.

అల్‌డ్విక్‌ జట్టుకు చెందిన అలెక్స్‌ రైడర్‌ అనే 16 ఏళ్ల యువ బౌలర్‌ విసిరిన ఓ బంతిని బ్యాటర్‌ గాల్లోకి ఆడాడు. ఆ బంతి బౌలర్‌ దగ్గరకే రావడంతో దాన్ని క్యాచ్‌ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే అదే సమయంలో అతడు వెనక్కి పడిపోవడంతో క్యాచ్‌ చేజారి బంతి కిందపడేలా కనిపించింది. అయితే, అప్పుడు ఆ బంతి బౌలర్‌ కుడి కాలుకు తాకి మళ్లీ గాల్లోకి లేచింది దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అలెక్స్ గబుక్కున లేచి బంతిని తన చేతుల్లో ఆ బంతిని బంధించాడు. ఊహించని ఈ పరిణామంతో విస్తుపోయిన బ్యాటర్ నిరాశగా వెనుదిరిగాడు. ఊహించని ఈ క్యాచ్‌తో మైదానంలో నవ్వులు విరిశాయి. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.. అద్భుతమైన ఈ వీడియోను మీరూ చూసేయండి.