టీం ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ ఏడాది మూడో క్రికెటర్ ఓ ఇంటివాడయ్యాడు. ఇప్పటికే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ వివాహాలు జరగగా, తాజాగా భారత్ ఆల్ రౌండర్ శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur) పెళ్ళి చేసుకున్నాడు. తన స్నేహితురాలు, వ్యాపారవేత్త మిథాలీ పార్కులర్‌ను సోమవారం పెళ్లాడాడు. వీరి వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో మాత్రం వివాహాన్ని వైభవంగా జరిపించారు.
వివాహా వేడుకల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌లు పాల్గొన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ టీం సభ్యుడు అభిషేక్ నాయర్, తదితరులు కూడా సందడి చేశారు. శార్దూల్ ఠాకూర్ పెళ్లి వేడుకకు సంబంధించిన కొన్ని వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Congratulations You Beautiful Couple Lord #Shardul Thakur and Mittali Parulkar pic.twitter.com/vKSUQjGgY1
— Lalit Tiwari (@lalitforweb) February 27, 2023
గత కొంతకాలంగా శార్ధూల్ -మిథాలీ పార్కులర్‌లు ప్రేమలో ఉన్నారు. రెండేళ్ల కిందట వీరి నిశ్చితార్థం జరగ్గా పెళ్లికి మాత్రం సమయం పట్టింది. సోమవారం మిథాలీ పార్కులర్ మెడలో శార్ధూల్ మూడుముళ్లు వేసినా..పెళ్లి వేడుకలు మాత్రం మూడు రోజుల ముందే ప్రారంభమయ్యాయి.పెళ్లికి ముందు హల్దీ వేడుకను ఘనంగా నిర్వహించారు. హల్దీ సెలెబ్రేషన్స్‌లో శార్ధూల్ ఠాకూర్ తన కుటుంబ సభ్యులతో కలిసి హుషారుగా డ్యాన్స్ వేస్తూ కనిపించాడు.
భారత్ తరుపు శార్దూల్ ఠాకూర్ 8 టెస్టులు, 34 వన్డేలు, 26 టీ20లు ఆడాడు. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో శార్దూల్ అవకాశం దక్కించుకున్నాడు. ఐపీఎల్ – 2023లో కేకేఆర్ జెర్సీలో మెరవనున్నాడు శార్దూల్.