బట్టలుతికి మరుగుదొడ్డి శుభ్రం చేసిన శిఖర్‌ ధావన్‌..వీడియో - MicTv.in - Telugu News
mictv telugu

బట్టలుతికి మరుగుదొడ్డి శుభ్రం చేసిన శిఖర్‌ ధావన్‌..వీడియో

March 25, 2020

shikhar dhawan.

కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో 100 కోట్ల భారతీయులు ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం ఇళ్లల్లో ఉండిపోయారు. దీంతో వాళ్ళు ఇళ్లల్లో ఏం చేస్తున్నారో వీడియోలు తీసు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

నిన్న బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సింకు దగ్గర అంట్లు తోముతున్న వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెల్సిందే. తాజాగా టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంట్లో మరుగుదొడ్డి శుభ్రం చేస్తూ, బట్టలు ఉతికాడు. దీనికి సంబంధించిన వీడియోను శిఖర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. ధావన్ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.