ఇటలీలో విరుష్క జంట పెళ్లి నిజమే… - MicTv.in - Telugu News
mictv telugu

ఇటలీలో విరుష్క జంట పెళ్లి నిజమే…

December 9, 2017

భారత క్రికెట్ సారథి విరాట్ కోహ్లి, బాలీవుడ్ అందాల భామ అనుష్క శర్మలను ఇటలీలో పెళ్లి చేసుకుంటున్నట్లు ఖాయంగా తెలుస్తోంది . అయితే వీరు పరిస్థితి ఇంతదాకా వచ్చినా పెళ్లి గురించి  ఎటువంటి అధికార ప్రకటనా చేయలేదు.

శుక్రవారం అనుష్క కుటుంబంతో సహా ముంబై ఎయిర్ పోర్టులో  కనిపించి ఈ  వార్తకు మరింత బలాన్ని చేకూర్చుంది.  కొన్నాళ్ల క్రితం  డెహ్రాడూన్‌లో విరుష్క  జంటను ఆశీర్వదించిన పురోహితుడు కూడా విమానం ఎక్కేందుకు వచ్చాడు. అనుష్క  తండ్రి అజయ్ కుమార్ కూడా  పొరిగింటి వారిని, బంధుమిత్రులను ఇటలీకి రమ్మని ఆహ్మానించారు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని,  పెళ్లి సింపుల్‌గా చేస్తామని ఆయన అన్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ పెళ్లికి సంబంధించిన మరో వార్త కూడా పొక్కింది.  విరాట్ తన పెళ్లికి  కేవలం ఇద్దరు క్రికెటర్లను మాత్రమే ఆహ్వానించాడట.  సచిన్ టెండూల్కర్‌తో పాటు యువరాజ్ సింగ్‌ను విరాట్ ఆహ్వానించినట్టు సమాచారం. భారత జట్టు శ్రీలంకతో జరిగే టీ-20 సిరీస్‌లతో బిజీగా ఉండటంతో విరాట్ సచిన్ , యూవీలతో పాటుగా తన చిన్ననాటి స్నేహితులను కొందర్ని ఆహ్వానించినట్టు  తెలుస్తోంది.

పెళ్లికి  మూడు నెలల క్రితమే విరాట్ ,అనుష్క కుటుంబాలు ప్లాన్ చేశారు. కావాలనే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారని విరాట్ సన్నిహిత  వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ నెల 12న ఇటలీలోని మిలాన్‌లో  కుటుంబ సభ్యులు ,కొంత మంది సన్నిహితుల సమక్షంలో  విరుష్కల వివాహం చేసుకోబోతున్నారనే వార్తను బలం చేకూరుస్తుంది.