ఎన్నికల్లో పోటీ చేయని సెహ్వాగ్ - MicTv.in - Telugu News
mictv telugu

ఎన్నికల్లో పోటీ చేయని సెహ్వాగ్

March 15, 2019

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తున్నారు. రానున్న 17వ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు తెగ షికార్లు చేస్తున్నాయి. అయితే ఆ వార్తలను ఖండించారు ఢిల్లీకి చెందిన బీజేపీ నాయకుడొకరు. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సెహ్వాగ్ నిరాకరించాడని స్పష్టం చేశారు. పశ్చిమ ఢిల్లీ నుంచి సెహ్వాగ్‌ను బరిలో దింపాలని బీజేపీ భావించిందని, అందుకు ఆయన ఆసక్తి చూపడం లేదన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికల్లో పోటీ చేయనని సెహ్వాగ్ సున్నితంగా తిరస్కరించాడని పేర్కొన్నారు.

Cricketer Virender Sehwag Declined Offer To Contest Polls In Delhi Top BJP Leader

ఆయనకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన, ఆసక్తి లేవని చెప్పినట్టు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా సెహ్వాగ్ బీజేపీ టికెట్ మీద హర్యానాలోని రోహతక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. వాటిపై సెహ్వాగ్ స్పందిస్తూ..  అవన్నీ వదంతులేనని కొట్టిపారేసిన విషయం తెలిసిందే. తాజా వార్తలపై ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.