యువరాజ్ సింగ్ సంచలన నిర్ణయం - MicTv.in - Telugu News
mictv telugu

యువరాజ్ సింగ్ సంచలన నిర్ణయం

June 10, 2019

cricketer Yuvraj Singh may announce retirement from international cricket today.

ఒకవైపు ప్రపంచ క్రికెట్ కప్ జరుగుతుంటే.. క్రికెట్ అభిమానులకు చేదు వార్త వినిపించాడు యువరాజ్ సింగ్. ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈరోజు సౌత్ ముంబై హోటల్‌ల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. 2011 ఐసీసీ ప్రపంచకప్‌లో హీరోగా నిలిచిన యువరాజ్ గత కొన్ని నెలలుగా జట్టులో స్థానం కోల్పోయాడు.

ఈమధ్యకాలంలో యువరాజ్ క్యాన్సర్ బారిన పడడం కూడా జరిగింది. క్యాన్సర్ నుంచి కోల్కోని మళ్ళీ జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ టోర్నీల్లో కూడా కీలకంగా వ్యవహరించాడు. వయస్సు పెరగడం, అంతర్జాతీయ జట్టులోకి కొత్త ఆటగాళ్లు వస్తుండడంతో రిటైర్మెంట్ తీసుకోవడమే ఉత్తమని యువరాజ్ భావిస్తున్నాడని తెలుస్తుంది. రిటైరయ్యాక.. ఐసీసీ అనుమతి పొందిన కెనడా, హాలెండ్‌, ఐర్లండ్‌లలో జరిగే టీ20 టోర్నీలలో ఆడనున్నాడని బీసీసీఐ సీనియర్ అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యువీ రిటైర్మెంట్‌ వార్త తెలియడంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాకయ్యారు.