అవేం షాట్లురా బాబోయ్..సూర్యపై ఆగని ప్రశంసలు - MicTv.in - Telugu News
mictv telugu

అవేం షాట్లురా బాబోయ్..సూర్యపై ఆగని ప్రశంసలు

November 8, 2022

టీ 20 వరల్డ్ కప్‌లో అద్భుతమై ఫామ్‌లో ఉన్నాడు ఇండియన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్. తన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. 360 డిగ్రీస్ ఆటతో చెలరేగిపోతున్నాడు. సూర్య ధాటికి బౌలర్లకు ఎక్కడ బంతి వేయాలో అర్థం కాని పిరిస్థితి నెలకొంది. తనదైన ర్యాంప్, స్కూప్ షాట్లతో బౌలర్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇప్పటి వరకు టోర్నిలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో 226 పరుగులు చేసాడు. పాకిస్తాన్ పై 15 పరుగులు మినహా మిగతా అన్ని మ్యాచ్‌ల్లోనూ సూర్య విధ్వంశమే సృష్టించాడు. నెదర్లాండ్స్ పై 25 బంతుల్లో 51, సౌతాఫ్రికాపై 40 బంతుల్లో 68, బంగ్లాదేశ్‌పై 16 బంతుల్లో 30, జింబాబ్వేపై 25 బంతుల్లో 61 పరుగులతో రాణించాడు. ప్రధానంగా జింబాబ్వేపై సూర్యకుమార్ యాదవ్ ఆడిన షాట్ పై క్రీడా లోకం చర్చిస్తోంది. ఆ షాట్ లు నమ్మశక్యంగా లేవని మాజీ, తాజా క్రికెటర్లు సైతం సూర్యను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

సెమీ-ఫైనల్స్‌లో టీమిండియాతో మ్యాచ్‌కు ముందు సూర్యకుమార్ యాదవ్‌ను ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ప్రశంసించాడు. ‘జింబాబ్వేపై అతను కొట్టిన షాట్‌లను ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటూ’ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్ జట్టు తరపున విజయవంతమైన ఆల్ రౌండర్‌గా పేరుగాంచిన బెన్ స్టోక్స్.. మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుని జట్టును గెలిపించగల సత్తా సూర్యకే ఉందంటూ ప్రశంసించారు.

https://www.instagram.com/icc/?utm_source=ig_embed&ig_rid=562463aa-3b7a-41dc-a70e-5810a7b9776c 

పాకిస్తాన్ మాజీలు సూర్యకుమార్ బ్యాటింగ్‌ను పొగడకుండా ఉండలేకపోతున్నారు.ఆ దేశ మాజీ ఆటగాడు షాహీద్ అఫ్రిద్, బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ సూర్యకుమార్‌ను ఆకాశానికెత్తేశారు. సూర్యకుమార్ యాదవ్ చూసి నేర్చుకోవాలంటూ ఏకంగా పాక్ ఓపెనర్ రిజ్వాన్‌కు ఆఫ్రిది సూచించాడు. ఇకనైనా రిజ్వాన్ కొత్త షాట్లు ఆడాలని తెలిపాడు. మిడ్ ఆఫ్, ఎక్స్ ట్రా కవర్స్ లో షాట్స్ కొట్టడం బాగా ప్రాక్టీసు చేయాలని కోరాడు.

ఇక సూర్యకుమార్ యాదవ్ పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ప్రశంసలు కురిపించారు. అతను వేరే గ్రహం నుంచి వచ్చాడని తాను అనుకుంటున్నానని.. ఏ గ్రహం నుంచి వచ్చావు? అని అక్రమ్ సరదాగా వ్యాఖ్యానించారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే సూర్య చాలా డిఫరెంట్ అని అన్నారు. 2022లో టీ20లో వెయ్యి పరుగులను సాధించిన ఏకైక క్రికెటర్ సూర్య మాత్రమేనని చెప్పారు.ఏ మాత్రం భయం లేని బ్యాట్స్ మెన్ వసీం అక్రం కితాబిచ్చారు.