తిరుమల వెంకన్న సేవలో రోహిత్ శర్మ, దినేష్‌ కార్తీక్‌ - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల వెంకన్న సేవలో రోహిత్ శర్మ, దినేష్‌ కార్తీక్‌

May 10, 2019

టీమిండియా క్రికెటర్లు రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌లు తిరుమల వెంకన్న సన్నిధికి విచ్చేశారు. ఈరోజు తెల్లవారుజామున దినేష్ కార్తీక్ స్వామివారిని దర్శనం చేసుకోగా.. ఉదయం 7 గంటల సమయంలో రోహిత్‌శర్మ దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు రోహిత్‌శర్మ, దినేష్‌కార్తీక్‌లకు ఘన స్వాగతం పలికారు.

Cricketers rohit sharma and dinesh karthik visited tirumala tirupati

రోహిత్‌ శర్మ, దినేష్‌ కార్తీక్‌లు తరచుగా తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తుంటారు. 2017లో ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన తర్వాత సతీసమేతంగా రోహిత్‌ శర్మ.. వెంకన్నను దర్శించుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్స్‌కి చేరిన సంగతి తెలిసిందే.