Home > Featured > ఎంత ఆటగాడైనా…హీరోయిన్ కు పడిపోవాల్సిందే

ఎంత ఆటగాడైనా…హీరోయిన్ కు పడిపోవాల్సిందే

cricketers whos married actress

క్రికెటర్లకు, సినిమా వాళ్ళకు ఎక్కడో ఒక చోట ముడివేసే ఉంటుంది. ఇద్దరూ మనల్ని ఎంటర్టైన్ చేసేవారే. ఒకరు ఆటతో మరొకరు నటనతో. ఐపీఎల్ వచ్చాక వీళ్ళ బంధాలు మరింత పెరిగిపోయాయి. ఐపీఎల్ లో సగం ఫ్రాంఛైజీ ఓనర్లు సినిమా తారలే. ఇదంతా ఒక వైపు…మరోవైపు హీరోయిన్లను పెళ్ళాడిన క్రికెటర్లూ తక్కువేమి కాదు. రీసెంట్ గా కె.ఎల్ రాహుల్ సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టితో పెళ్ళయింది. దీంతో ఈ విషయం మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది. అలా సినీ తారల్ని పెళ్ళాడిన క్రికెటర్లు ఎవరో ఒక లుక్ వేద్దాం రండి.

టీమ్ ఇండియా క్రికెటర్లకు- బాలీవుడ్ నటీమణుల మధ్య ఉండే రిలేషన్ షిప్స్ గురించి ప్రత్యేకంగా ఇప్పుడే గుర్తు చేయాల్సిన పనిలేదు. ఈ రెండు రంగాల్లో ప్రేమాయణాలు రిలేషన్ షిప్స్ అనేవి అనాదిగా కొనసాగుతున్న సాంప్రదాయమే. రెండు రంగాలు క్రేజీ ఫాలోయింగ్ ఉన్నవి కాబట్టి క్రికెటర్లతో బాలీవుడ్ భామామణుల ఎఫైర్లు ఎప్పటికప్పుడు ఆసక్తిక డిబేట్ గా మారుతున్నాయి. క్రికెట్ ప్రారంభమై పాపులర్ గేమ్ గా మొదలైన నాటి నుంచి ఎంతో మంది క్రికెర్లతో బాలీవుడ్ హీరోయిన్లు ఎఫైర్లు నెరిపారు. వారిలో అదికొద్ది మంది మాత్రమే వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.

హీరోయిన్ పెళ్ళిచేసుకున్న క్రికెటర్ అంటే ముందు చెప్పుకోవలసింది…మన్సూర్ అలీ ఖాన్ . 60ల నుంచి 80ల వరకూ ఇండియా టీమ్ లో ఉన్న ఈ క్రికెటర్ అప్పటి స్టార్ బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ ను పెళ్ళిచేసుకున్నారు. 1968లో వీరి పెళ్ళి జరిగింది. సైఫ్ అలీ ఖాన్ వీరి కొడుకే.

తర్వాత చెప్పుకోవలసింది హైదరాబాదీ క్రికెటర్ అజారుద్దీన్ గురించి. ఈ మాజీ కెప్టెన్ 1996లో నటి సంగీతా బిజిలానీని పెళ్ళిచేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరూ కొన్నేళ్ళే కలిసి ఉన్నారు. 2010లో విడాకులు తీసుకుని విడిపోయారు.

యువరాజ్ సింగ్…ఇతనో సంచలనం, అందరికీ తెలిసినదే. ఇండియన్ టీమ్ లో ఉన్నది తక్కువ కాలమే అయినా ఉన్నన్నాళ్ళూ చెలరేగి ఆడాడు. ఇతను కూడా బాలీవుడ్ నటి హాజెల్ కీచ్ ను పెళ్ళిచేసుకున్నాడు. తమిళ్ బిల్లా, హిందీ బాడీ గార్డ్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటించింది. ఐటెమ్ సాంగ్స్, టీవీ షోల్లో కూడా పాల్గొంది.

హర్భజన్-గీతా బస్రా…ఎనిమిదేళ్ళు ప్రేమించుకున్న ఈజంట 2015లో ఒక్కటయ్యారు. దిల్ దియా హై, ది ట్రైన్, మరికొన్ని సినిమాల్లో గీతా నటించారు.

జహీర్-సాగరిక….భారత జట్టు మీడియం పేసర్ అయిన ఇతను నటి సాగరిక ఘట్కేను 2017లో వివాహం చేసుకున్నాడు. చక్ దే ఇండియాతో సాగరిక బాగా పాపులరైంది.

భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఏకంగా విదేశీ నటినే పెళ్ళి చేసుకున్నాడు. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ ను 2020లో పెళ్ళి చేసుకున్నాడు. నటాషా కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది. స్పెషల్ సాంగ్స్ లోనూ మెరిసింది.

అందరికన్నా పాపులర్ జంట…విరాట్ కోహ్లీ, అనుష్కా శర్మలు. వీళ్ళిద్దరిదీ కూడా ప్రేమ వివాహమే. డిసెంబర్ 2017లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. క్యూట్ కపుల్ గా వీళ్ళిద్దరికీ మంచి పేరు ఉంది. బోలెడు యాడ్స్ లో కలిపి నటించారు. విరాట్ ఆడే ప్రతీ మ్యాచ్ కూ అనుష్క వెళుతుంది. తాను చేసే ప్రతీ పనికి రివాట్ మద్దతుగా ఉంటాడు. చూడ్డానికి చక్కగా ఉండే ఈ జంటకు ఒక పాప ఉంది.

చాహల్-ధనశ్రీ….టీమ్ ఇండియా స్పిన్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ 2020లో పెళ్ళి చేసుకున్నారు. ధనశ్రీ నటి కాదు కానీ కొరియోగ్రాఫర్, యూట్యూబర్, సోషల్ మీడియా సెలబ్రిటీ.

వీళ్ళు పెళ్ళి చేసుకుని సెటిల్ అయిన క్రికెటర్లు, తారలు, వీళ్ళు కాకుండా సౌరవ్ గంగూలీ, నగ్మాల మధ్య కొన్నాళ్ళు ప్రేమ సాగిందని రూమర్లు వచ్చాయి. అయితే అప్పటికే సౌరవ్ కు పెళ్ళవడంతో ఎక్కువ కాలం ఇవి నిలవలేదు. అలాగే నటి రీనా రాయ్ ను పాకిస్తాన్ క్రికెటర్ మొహసీన్ ఖాన్ ను పెళ్ళిచేసుకుంది. కానీ వీరి బంధం సజావుగా సాగక విడాకులు తీసుకున్నారు.

ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్ కి వెళితే.. మాజీ క్రికెటర్ల గతంలోకి వెళ్తే ఇండియా కోచ్ గా ఎన్నో సేవలందించిన రవిశాస్ట్రి ఇండస్ట్రీ ప్లే బోయ గా పేరుగాంచిన సంగతి తెలిసిందే. రవి శాస్త్రి- అమృతాసింగ్ మధ్య ఎఫైర్ అప్పట్లో ఓ పెద్ద సంచలనమే రేపింది. స్టేడియంలోనే అమృతాసింగ్ రవిశాస్త్రిని ముద్దాటడం బహిరంగ చర్చగా మారింది. కానీ అది పెళ్లి వరకూ చేరలేదు. రవిశాస్త్రి.. రీతూసింగ్ ని వివాహం చేసుకోగా.. అమృతా సింగ్ -సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ జంటలు కూడా కలిసి ఉండటం లేదు. అలాగే వెస్టీండీంస్ లెజెండరీ ప్లేయర్ సర్ వివియన్ రిచర్స్డ్ - బాలీవుడ్ నటి నీనా గుప్తాల ప్రేమకథ అప్పట్లో బహిరంగమే. అప్పటికే పెళ్లైన రిచర్స్డ్ నీనా చాలాకాలం సహజీవనం చేసారు. ఈ ప్రేమకు గుర్తుగా మసాబా అనే కూమార్తె కూడా ఉన్నారు. ఇప్పుడు మసాబా ఫేమస్ డిజైనర్ అయ్యారు.

Updated : 26 Jan 2023 12:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top