క్రికెట్ లో రెడ్ , ఎల్లో కార్డు..కొత్త రూల్స్ అదుర్స్... - MicTv.in - Telugu News
mictv telugu

క్రికెట్ లో రెడ్ , ఎల్లో కార్డు..కొత్త రూల్స్ అదుర్స్…

June 24, 2017

ఇక క్రికెట్ గ్రౌండ్ లో ప్లేయర్ల ఓవరాక్షన్ నడవదు. ఎక్కువ చేస్తే మైదానం నుంచి తరిమేస్తారు. ఇప్పటిదాకా వేలు ఎత్తి చూపిన అంపైర్లే వేలి వేస్తారు. క్రికెటర్ల దిమ్మతిరిగి రూల్స్ ను ఐసీసీ వచ్చింది. అవీ ఏంటంటే…
అంతర్జాతీయ క్రికెట్‌లో ఐసీసీ కొత్త నిబంధనలను పెట్టింది. భారత క్రికెట్‌ జట్టు మాజీ ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే నేతృత్వంలోని 14మంది సభ్యుల ప్యానెల్‌ తాజా నిబంధనలపై చర్చలు జరిపి ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీకి సిఫార్సు చేసింది. దీనికి ఆమోద ముద్ర వేసిన ఐసీసీ తాజా రూల్స్ అక్టోబరు 1 నుంచి అమల్లోకి తీసుకురాబోతోంది. ఇక నుంచి ఏ ఆటగాడైనా దూకుడుగా ప్రవర్తిస్తే అతన్ని గ్రౌండ్ వెలుపలికి పంపే హక్కు అంపైర్లకు ఇచ్చింది.

ఈ తరహా రూల్స్ ఇప్పటికే ఫుట్‌బాల్‌ క్రీడలో ఉన్నాయి. మ్యాచ్‌ జరిగే సమయంలో ఏ జట్టుకి సంబంధించిన ఆటగాడైనా ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై దూకుడుగా ప్రవర్తించినా, వివాదాలకు తెరతీసినట్లు తేలినా అంపైర్లు పసుపు, ఎరుపు కార్డులతో సంకేతాలిచ్చి ఆట మధ్యలో నుంచి బయటకు పంపిస్తారు. ఘటన తీవ్రతను బట్టి ఆ ప్లేయర్ తిరిగి ఆడేది లేనిదీ నిర్ణయిస్తారు. నేరం తీవ్రమైందని తేలితే కొన్ని మ్యాచ్‌లలో ఆడకుండా సస్పెన్షన్‌ వేటు వేస్తారు. ఇప్పుడు ఇదే తరహా పద్ధతికి ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. ఈ కొత్త రూల్స్ ని ఏ ఆటగాడైనా బ్రేక్ చేస్తే ఐసీసీ నియమావళిని ఉల్లంఘించినట్లే అవుతుంది. డీఆర్‌ఎస్‌ పద్ధతి అమలులోనూ స్వల్ప మార్పులు చేసింది. ఇక నుంచి డీఆర్‌ఎస్‌ పద్ధతి టీ20ల్లోనూ అమలుచేయబోతోంది. అంతేకాదు బ్యాట్స్‌మెన్‌ఉపయోగించే బ్యాట్‌ డిజైన్ పై కూడా స్మాల్ చేంజేస్ చేసింది.