ఆడు మగాడ్రా బుజ్జీ..! - MicTv.in - Telugu News
mictv telugu

ఆడు మగాడ్రా బుజ్జీ..!

June 20, 2017

తొక్కలో మ్యాచ్ పోతే పోయింది. ఆట అంటే అంతే.పాకిస్థాన్ చేతిలో ఓడితే యుద్ధంలో ఓడినట్టే కాదు గదా..ఏదో శక్తే పాకిస్థాన్ ని గెలిపించిందని స్పోర్టివ్ స్పిరిట్ గా తీసుకుందాం.కానీ ఇందులో ఒకే ఒక్కడు గురించి చెప్పుకోవాలి. నిజంగా వాడు మగాడ్రా బుజ్జీ…ప్లేయర్ గానే కాకుండా సగటు భారతీయ అభిమానిలా స్పందించాడు. గ్రౌండ్ లోనే కాదు బయట కేక పుట్టించాడు.ఇంతకీ ఎవరతను..?

‘ మమ్మల్ని మేమే మోసం చేసుకున్నాం. ప్రత్యర్ధి జట్టుకు అంత సామర్థ్యం లేదు’ అవును ఇది 100 శాతం నిజం. ఫ్యాన్స్ అందరిదీ ఇదే మాట. ఇలా మాట్లాడిందెవరో తెలుసా హార్ధిక్ పాండ్య.టీమిండియాలో రైజింగ్ స్టార్. నిజంగా ఇతను ఆవేశంలో అన్న మాటలే కావొచ్చు..చెత్తగా ఓడిపోయామన్న బాధలో వ్యక్తం చేయొచ్చు..కానీ ఇది వాస్తవం.
పాకిస్తాన్‌తో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఓటమి పాలవడం కన్నా.. సహచర ఆటగాడు రవీంద్ర జడేజా కారణంగా హార్దిక్ పాండ్యా ఔటైన తీరే అభిమానులను తీవ్ర నిరాశ పరిచింది. నిజానికి జడేజా బాల్ ని ఆడి ముందుకు పరుగెత్తగా.. పాండ్యా స్ట్రైకింగ్ వైపు ఫాస్ట్ గా వచ్చాడు. ఇంతలోనే మనసు మార్చుకున్న జడేజా వెనక్కి పరుగు తీశాడు. మొదట క్రీజులో బ్యాట్ పెట్టిన జడేజా నాటౌట్ కాగా, నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో బెయిల్స్ పడగొట్టడంతో.. సిక్సర్లతో పాక్ బౌలర్లపై విరుచుకుపడుతున్న పాండ్యా తీవ్ర నిరాశతో పెవిలియన్ కు వెళ్లాడు. వెళ్తూ వెళ్తూ వీర ఆవేశంలో ఊగిపోయాడు. బ్యాట్ ను బౌండరీ లైన్ కేసి కొట్టాడు.

ఎస్ ఇతని ఆవేశంలో అర్థం ఉంది. సిక్స్ లు , ఫోర్లతో వీరకుమ్ముడు కుమ్ముతున్న ఇతనే క్రీజులో ఉండటం మస్ట్. జడేజా ఔటైన ఏమికాదు..ఇలా పాండ్యా ఔట్ కాకపోయుంటే కాస్తా భారత్ పరువైనా కొంతలో కొంత దక్కేది. 32 బంతుల్లోనే 3 సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ చేసి ఐసీసీ టోర్నీల్లోనే ఫైనల్లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచిన హార్దిక్ (43 బంతుల్లో 76; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) రనౌట్ కావడమే అభిమానులను ఎక్కువగా బాధించింది. హార్దిక్ మరికాసేపు క్రీజులో ఉంటే ఓటమి అంతరాన్ని తగ్గించేవాడని, జడేజా తన వికెట్‌ను త్యాగం చేస్తే మంచి ఫలితం ఉండేదని క్రీడా విశ్లేషకుల మాట.
ఇక మ్యాచ్ ముగిసిన రోజు రాత్రి హార్ధిక్.. ‘ మమ్ముల్ని మేమే మోసం చేసుకున్నాం. ప్రత్యర్ధి జట్టుకు అంత సామర్థ్యం లేదు’ అని ట్వీట్ చేశాడు. అదీ వైరల్‌గా మారింది. ఆ వివాదాస్పద ట్వీట్‌ను పాండ్యా డిలీట్ చేసినా.. ఓ నెటిజన్ స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయడంతో విపరీతంగా రీట్వీట్ అవుతోంది. మమ్ముల్ని మోసం చేసుకున్నామంటే జడేజా ఇష్యూ ఒక్కటేనా..?మరేదైనా కారణం ఉందా..? ఆరోపణలు వస్తున్నటే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా…?ఇప్పుడు ఇవే అభిమానుల్ని తొలుస్తున్న ప్రశ్నలు..ఎప్పటికీ సమాధానం దొరకని ప్రశ్నలు.