వీడికో న్యాయం..వాళ్లకో న్యాయమా..! - MicTv.in - Telugu News
mictv telugu

వీడికో న్యాయం..వాళ్లకో న్యాయమా..!

July 5, 2017

రన్ రోబో.. ప్రణవ్‌ ధనవాడె గుర్తున్నాడు కదా…పాఠశాల స్థాయి క్రికెట్లో ఏకంగా 1009 పరుగులతో వరల్డ్ క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. ప్రపంచమంతా ఇతని బ్యాటింగ్ చూసి ముచ్చట పడింది. ప్రణవ్ టాలెంట్ కు మెచ్చిన ముంబై క్రికెట్ సంఘం నెలకు రూ.10 వేల చొప్పున ఐదేళ్లపాటు స్కాలర్ షిప్ అందిస్తామని ప్రకటించింది. ఏడాది పాటు కరెక్ట్ గా నే ఉపకార వేతనం ఇచ్చింది. ఇప్పుడు ప్రణవ్ ఆట తీరు బాగోలేదని స్కాలర్ షిప్ ఆపేశారు. ఎస్.. ఎంసీఏ చేసిన పని వోకే…మరి టీమిండియా ప్లేయర్లకు ఇది ఎందుకు వర్తించదు..? పేలవమైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ప్లేయర్లను ఏళ్లకు ఏళ్లు ఎందుకు ఆడిస్తున్నారు..? వారికి ఏలాంటి కోతలు విధించని క్రికెట్ పెద్దలు..ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రణయ్ విషయంలో ఎందుకీ అత్యుత్సాహం..?పిల్లాడ్ని ప్రోత్సాహించాల్సింది పోయి ఇస్తున్న సాయాన్ని ఆపేయడం ఎంతవరకు న్యాయం.?

క్రికెట్ ఎక్కడైనా క్రికెటే..రూల్ ఈజ్ రూల్. గల్లీ నుంచి ఇంటర్నేషనల్ దాకా అంతే. స్కూల్ లెవల్ క్రికెట్ నుంచి టీమిండియా ప్లేయర్ల వరకు బాగా ఆడేవాళ్లని ఎంకరేజ్ చేయాల్సిందే. ఆడని వాళ్ల ప్లేస్ లో రైజింగ్ స్టార్స్ కి మరొకరికి చాన్స్ ఇవ్వాలి. ఇది ఎప్పటినుంచో వస్తుంది. కొన్నిసార్లు మాత్రం లెక్క తప్పుతుంది. దానికి రకారకాల కారణాలు ఉంటాయి. రైజింగ్ స్టార్స్ విషయంలో కొంత వెసులు బాటు కల్పించొచ్చు. ఎదిగే అవకాశం ఉన్నవాళ్లకు ఒకటి, రెండు చాన్సులు ఇస్తే తప్పు లేదు. స్కూల్ లెవల్ క్రికెట్లో వెయ్యి పరుగులతో దుమ్మురేపిన రన్ రోబో ప్రణవ్ ధనవాడె కు మాత్రం ముంబై క్రికెట్ సంఘం హ్యాండిస్తోంది. ఇస్తానన్న ఆర్థిక సాయాన్ని నిలిపేసింది. అంతే కాదు అండర్‌-19 ఆటగాళ్లకు ప్రత్యేక శిక్షణ శిబిరం కోసం ఎంపిక చేసిన 35 మందిని ఎంసీఏ ఎంపిక చేసింది. అందులో ప్రణవ్‌కు చోటు దక్కలేదు. ఈ మధ్య ఎంసీఏ మ్యాచ్‌కు నిర్వహించిన సెలక్షన్‌ ట్రయల్స్‌ నుంచి కూడా కోచ్‌ అతడిని తప్పించాడు. ప్రణవ్‌ వికెట్‌ కీపింగ్‌ బాగానే చేస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మెరుగవ్వాల్సి ఉందని కోచ్‌ మోబిన్‌ అంటున్నాడు. ఈ మాటలు నిజమే కావొచ్చు..మంచి టాలెంట్ ఉన్న మరో చాన్స్ ఏం పోతుందుని క్రికెట్ అభిమానుల మాట.

సరే ప్రణవ్ లాగే టీమిండియా ప్లేయర్ల విషయంలో బీసీసీఐ..ఎంసీఐ లాగే ఎందుకు ఆలోచించడం లేదు. ఫామ్ లో లేని ఆటగాళ్లను కొనసాగిస్తూనే ఉంది. సెలక్టర్ల అండదండలుంటే ఎలా ఆడినా ఫర్వాలేదా..?ఆర్నెళ్ల నుంచి చెత్తగా ఆడుతున్న ప్లేయర్లు టీమిండియాలో ఉన్నారు. ఒకటి , రెండు మ్యాచ్ లు అంటే వోకే..అరడజన్ , డజన్ మ్యాచ్ ల్లో పేలవమైన ప్రదర్శన ఇస్తున్న వాళ్లను ఇంకా ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు.? పాండ్యా లాంటి వాళ్లను ప్రొత్సాహించి జడేజా లాంటి సీనియర్లను ఎందుకు పక్కన పెట్టడం లేదు..?ప్రణవ్ లాగే వీళ్లకు కోతల ఎఫెక్ట్ వేయొచ్చు కదా..స్కూల్లో లెవల్లో ఎదుగుతున్న పిల్లాడికో న్యాయం..టీమిండియా ప్లేయర్లకో న్యాయమా..క్రికెట్ సంఘాలు వేరైనా ఆట ఆటే..రూల్ రూలే..ప్లేయర్ ప్లేయరే. సో ప్రణవ్ లాంటోళ్లు ఫామ్ లో లేకపోయిన ఎంకరేజ్ చేయాలి.ఎప్పటికోరోజు ఫామ్ లోకి వస్తారు. అదిరిపోయే ఫెర్మామెన్స్ తో టీమిండియా లో భవిష్యత్ లో ప్లేస్ కూడా కొట్టేయొచ్చు.