crickters Emotional Reactions
mictv telugu

క్రికెటర్ల కన్నీళ్లు..

November 11, 2022

crickters Emotional Reactions

ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఒక్క ఆట వాళ్ల పరువుతీసేస్తోంది. ఒక్క ఆట క్రికెటర్లను కన్నీళ్లు పెట్టిస్తోంది. ఒక్కఆట వాళ్ల రికార్డులనూ సైతం చెరిపేస్తుంది. భారత్ అంతా వాళ్లను తిట్టిపోస్తోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జరుగుతోంది.

కామెంట్లు-కన్నీళ్లు

ఆట అన్నాక గెలుపు,ఓటములు సహజం. కానీ కనీస పోటీ ఇవ్వలేదనేదే భారత అభిమానుల బాధ. అందుకే క్రికెటర్లను తెగ తిట్టిపోస్తున్నారు.పాపం క్రికెటర్ల బాధ ఎవరు పట్టించుకుంటున్నారు…వాళ్లు మనకంటే ఎక్కువ బాధపడుతున్నామని చెప్పాలనుకున్నారేమో..బరువెక్కిన హృదయాలతో , భారమైన గుండెలతో ట్వీట్లు చేస్తున్నారు రోహిత్ శర్మ డగౌట్‌లో ఏడిస్తే…మిగతా క్రికెటర్ల ట్విట్టర్ కామెంట్ల రూపంలో కన్నీళ్లు పెడుతున్నారు.

crickters Emotional Reactions

సారీ..మాకూ బాధే…

“మా కలను సాధించలేదు..తీవ్ర నిరాశతో భారమైన హృదయాలతో ఆస్ట్రేలియా తీరాన్ని వీడుతున్నాం. ఇక్కడి నుంచి మరింత మెరుగు అవ్వాలన్నదే మా లక్ష్యం” అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశారు. యువబ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఉద్వేగానికి లోనయ్యారు. బాధాకరమైన ఓటమి..ఎక్కడ ఆడినా మద్దతు ఇచ్చే అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం..అని ట్వీట్ చేశారు. నా దేశానికి ఆడటం గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరింత బలంగా తిరిగొస్తామంటున్నాడు. టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ గుండెలు బద్దలైన ఎమోజీని ట్వీట్ చేశాడు. ఈ ఓటమి భరించలేనిది..చాలా బాధగా ఉందని హార్దిక పాండ్యా ట్వీట్ చేశారు.

ప్రశ్నించే టైమ్ వచ్చింది

భారత క్రికెటర్లపై మాజీలు మండిపడుతున్నారు. ఇంత చెత్తగా పసికూనలు కూడా ఆడవంటున్నారు.హర్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలంటున్నారు. సీనియర్లు రిటైర్డ్ అయితే మంచిదని ఉచిత సలహా ఇస్తున్నారు.అంతేకాదు రోహిత్‌ను, రాహుల్‌ని ప్రశ్నించే టైమ్ వచ్చిందంటున్నారు.

వెనకేసుకొచ్చిన సచిన్

సచిన్ మాత్రం టీమిండియాను వెనకొసుకొచ్చారు. నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్టే గెలుపు ఓటములు ఆటలో సహజమన్నారు. గెలిస్తే సంబరాలు సంబరాలు ఎలా చేసుకుంటామో…ఓడితే అలానే ఆటగాళ్లను అర్థం చేసుకోవాలని సచిన్ అంటున్నారు. ఇక దేశమంతా టీమిండియాని ఏకిపారేస్తోంది. కనీస పోటీ ఇవ్వలేకపోయారని రగిలిపోతోంది. క్రికెటర్ల ట్వీట్లతోనైనా క్రికెట్ లవర్స్ కూల్ అవుతారేమో చూడాలి.