అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు !
ఈ ప్రపంచంలో ఉత్త పుణ్యానికి కూడా ప్రాణాలు పోగొట్టుకునే వాళ్ళున్నారా అంటే అవుననే అనొచ్చు ఈ ఉదంతాన్ని చూసి ? ఇంతకీ ఏం జరిగిందంటే..ముంబయి నగరంలో ఇద్దరు నల్ల జాతీయులు ( నైజీరియన్లు ) షేరింగ్ రూంలో వుండేవారట. ఆరోజు అతని పుట్టినరోజు అవటంతో ఇద్దరూ కలిసి రూంలో బర్త్ డే సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇంతలో వారి మధ్య ఒక చిన్న టాపిక్ వచ్చింది. ఆ టాపిక్కే చినికి చినికి గాలివానై ఒకర్ని శవాన్ని, ఇంకొకరిని హంతకుణ్ని చేస్తుందని పాపం ఊహించుకోలేకపోయినట్టున్నారు ?
ఫుట్ బాల్ ప్లేయర్లు అయిన రోనాల్డో, మెస్సీ ఇద్దరిలో ఒకరు గొప్పంటే ఒకరు గొప్పగా ఆడతారని ఇద్దరు మస్తు బహెజ్ పెట్టుకున్నారు. ఆ వాగ్వాదం కాస్త ఆవేశంగా మారింది. ఆ ఆవేశంలో గాజుపెంకుతో ఓబిన్నా గొంతులో పొడిచి చంపేశాడు. అంతే క్షణాల్లో మిత్రుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ముంబయి పోలీసులు హంతకుణ్ని అదుపులోకి తీస్కున్నారు కానీ చాలా విచిత్రంగా లేదూ ఈ హత్య వెనకాల క్రైం కథ ? అందుకే ఎక్కువగా ఎవరి మీద అభిమానం ఆవకాయలు పెంచుకోవద్దు. దీన్ని బట్టి మనకు తెలిసే నీతేంటీ.. వాదాలు అస్సులు పెట్టుకోవద్దు, వాదం ముదురుతున్నదంటే ఎవరో ఒకరు మౌనం వహించక తప్పదు ! ?
https://www.youtube.com/watch?v=aAlZlj_EULU