కేంద్రానికి సమ్మె సెగ.. 2000 మంది ఆందోళన బాట - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రానికి సమ్మె సెగ.. 2000 మంది ఆందోళన బాట

October 14, 2019

హిందూస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు చెందిన 20,000 మంది ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వేతన పెంపుపై యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలమవడంతో వారు సమ్మెకు దిగారు. సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్‌ఏఎల్‌కు చెందిన తొమ్మిది కార్మిక సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు. ప్రభుత్వ రంగ వేతన సవరణపై యాజమాన్యంతో జరిగిన చర్చలు ఫలించలేవని.. అందుకే సమ్మె చేపడతామని చెప్పారు. తమ డిమాండ్లపై ఒత్తిడి పెంచేందుకు కార్మిక చట్టాలకు అనుగుణంగా 15 రోజుల కిందటే తాము సమ్మె నోటీసు ఇచ్చామని వెల్లడించారు.

Hindustan.

అయితే సమ్మెను నివారించేందుకు అన్ని ప్రయత్నాలు చేసినా కార్మికులు నిరవధిక సమ్మెకు పూనుకున్నారని హెచ్‌ఏఎల్‌ తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా హెచ్‌ఏఎల్‌కు 4 పరిశోధన అభివృద్ధి కేంద్రాలు వుండగా.. బెంగళూర్‌, హైదరాబాద్‌, కోరాపుట్‌, లక్నో, నాసిక్‌లోని 5 ప్రొడక్షన్‌ కాంప్లెక్స్‌ల్లో 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.