ఈ మట్టిలోనే ఆయనను పాతిపెట్టాం, అనుచరులు ఓ లెక్క కాదు : శివసేన, బీజేపీ - MicTv.in - Telugu News
mictv telugu

ఈ మట్టిలోనే ఆయనను పాతిపెట్టాం, అనుచరులు ఓ లెక్క కాదు : శివసేన, బీజేపీ

May 14, 2022

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మహారాష్ట్రలోని ఔరంగజేబు సమాధిని దర్శించుకొని నమాజ్ చేయడంపై శివసేన, బీజేపీలు మండిపడ్డాయి. దీనిపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఘాటుగా స్పందించారు. ‘ఓవైసీ ఔరంగజేబును కీర్తించే ప్రయత్నం చేశారు. ఇది జాతీయవాద ముస్లింలకు అవమానకరం. ఈ దేశంలోని ముస్లింలకు ఔరంగజేబు ఎంత మాత్రం ఆరాధ్యుడు కాదు. మేం దీన్ని భరించే ప్రసక్తే లేదు. ఎంపీ నవనీత్ రాణాపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ఈ విషయంలో మాత్రం నోరు మెదపడం లేద’ని వ్యాఖ్యానించారు. ఇక శివసేన కూడా అంతే స్థాయిలో స్పందించింది. ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘ఛత్రపతి శివాజీకి వ్యతిరేకంగా పోరాడిన ఔరంగజేబు సమాధి ముందు నమాజ్ చేయడం అంటే మహారాష్ట్రను సవాలు చేయడమే. ఈ మట్టిలోనే ఔరంగజేబును పాతిపెట్టాం. ఆయన అనుచరులకు కూడా అదే గతి పడుతుంద’ని తీవ్రంగా విమర్శించారు. కాగా, ఔరంగాబాద్‌లోని ఖుల్దాబాద్‌కు ఎవరొచ్చినా ఔరంగజేబు సమాధిని దర్శించడం మామూలేనని, వేరే అర్ధం ఏమీ లేదని ఎంఐఎం పార్టీ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తెలిపారు.