దిశగా పేరు మార్పుపై విమర్శల వెల్లువ  - MicTv.in - Telugu News
mictv telugu

దిశగా పేరు మార్పుపై విమర్శల వెల్లువ 

December 3, 2019

name disha 01

షాద్‌నగర్ వద్ద దుర్మార్గుల చేతుల్లో బలైన పశువైద్యురాలి పేరును మార్చడంపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఆమెది అగ్రవర్ణం కాబట్టి ఆ కులం పేరు ప్రస్తావనకు రావొద్దొనే పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారని కొందరు విమర్శిస్తున్నారు. బడుగు, బలహీన వర్గాల మహిళలు ఇలాంటి దారుణాలకు బలైనప్పుడు పేర్లు మార్చడం లేదని, కుల ఒత్తిళ్లతోనే దిశగా మార్చారని అంటున్నారు. ‘గౌరవం, గోప్యత హక్కు కేవలం అగ్రవర్ణాలకేనా? దళిత, బీసీ కులాలకు ఉండవా?’ అని ప్రశ్నిస్తున్నారు.

మరోపక్క.. తమ పిల్లల అసలు పేర్లు కూడా దిశనే అని, పోలీసులు హత్యాచార బాధితురాలి పేరును దిశగా మార్చడం తమ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మరికొందరు చెబుతున్నారు. హతురాలి అసలు పేరు ఐదారు రోజుల పాటు మీడియాలో వచ్చిన తర్వాత ఇప్పుడు మార్చడంలో అర్థం లేదని అంటున్నారు.