గుడిలోకి శాకాహార మొసలి.. పూజారి రిక్వెస్ట్‌తో వెనక్కి - MicTv.in - Telugu News
mictv telugu

గుడిలోకి శాకాహార మొసలి.. పూజారి రిక్వెస్ట్‌తో వెనక్కి

October 22, 2020

jyhyt

కేరళలోని ఓ దేవాలయంలో వింత సంఘటన.. కాసరగోడ్‌లో ఉన్న శ్రీ అనంతపుర గుళ్ళోకి ఒక శాఖాహార మొసలి వచ్చింది. దీంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలిసిన ప్రధాన అర్చకుడు చంద్రప్రకాష్ నంబిసన్ రంగంలోకి ఇది.. దానిని వెళ్లి పోవాల్సిందిగా కోరాడు. పూజారి రిక్వెస్ట్ చేయడంతో ఆ మొసలి తిరిగి గుడి ప్రాంగణంలోని కొలనులోకి వెళ్ళింది. 

ఆ మొసలి డెబ్భై ఏళ్లుగా ఆ గుడిలోని కొలనులో ఉంటుందని స్థానికులు తెలిపారు. దాని పేరు బాబియా అని అది శాఖాహారం మాత్రమే తింటుందని తెలిపారు. ఇక బాబియా ఎప్పుడు క్రూరంగా ప్రవర్తించలేదని అక్కడి వారు తెలుపుతున్నారు. ప్రతి రోజు పూజరి దానికి రెండు పూటల ప్రసాదాన్ని ఆహారంగా అందిస్తారు. సరస్సు దగ్గరకు వెళ్లి పిలవగానే మొసలి పైకి వచ్చి అక్కడ పెట్టిన ప్రసాదాన్ని తీసుకుంటుంది. ఆ మొసలి అక్కడి సరసులోకి ఎలా వచ్చిందో ఎవరికి తెలియదు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.