నిజామాబాద్ జిల్లాలో బ్రిడ్జిపై మొసలి ప్రత్యక్షం - MicTv.in - Telugu News
mictv telugu

నిజామాబాద్ జిల్లాలో బ్రిడ్జిపై మొసలి ప్రత్యక్షం

September 22, 2019

భారీగా కురుస్తున్న వర్షాలకు జలాశయాల్లో ఉండాల్సిన మొసళ్ళు జనాల్లోకి వస్తున్నాయి. కొన్ని వారల క్రితం వడోదర, కర్ణాటకల్లో ఇలాంటి సంఘటనలు వెలుగు చూశాయి. తాజాగా నిజామాబాద్ లో ఇలాంటి సంఘటనే ఓకటి చోటుచేసుకుంది. 

జిల్లాలోని మొండోరా మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వరదలో ఓ మొసలి జనాల్లోకి కొట్టుకొని వచ్చింది. ధూద్ గాం బ్రిడ్జిపై మొసలిని గ్రామస్తులు గుర్తించారు. మొసలిని చూడగానే గ్రామస్తులు భయంతో పరుగులు తీశారు. శనివారం ఉదయం సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు జేసీబీ సహాయంతో మొసలిని పట్టుకున్నారు. మొసలిని జలాశయంలో వదిలిపెడతామని అధికారులు తెలిపారు.