ఆశ అడుగంటింది. పిల్లాడు మొసలి కడుపున ఇంకా బతికే ఉన్నాడని, ఒకవేళ చనిపోయి ఉన్నా శవమైనా దొరుకుతుందని గ్రామస్తులు కట్టేసిన మొసలి కథ ముగిసింది. మొసలి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని తిరిగి నదిలోకి వెళ్లగా, పిల్లాడి మృతదేహం నది ఒడ్డున దొరికింది.
మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో చంబల్ ఒడ్డున ఈ ఉదంతం చోటుచేసుకుంది.స్నానానికి వెళ్లిన ఏడేళ్ల పిల్లాడు కనిపించకపోవడంతో అక్కడే ఉన్న మొసలిని గ్రామస్తులు పట్టుకుని కట్టేశారు. బాలుడిని అదే మింగి ఉంటుందని, పొట్టకోసి తీయడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. మొసలి బాలుడిని కక్కుతుందని గ్రామస్తులు వేచి చూశారు. చివరికి బాలుడి మృతదేహం నడి ఒడ్డున కనిపించడంతో మొసలిని వదిలేశారు. దుఃఖంతో పిల్లాడికి అంత్యక్రియలు పూర్తి చేశారు.
Crocodile Was Captured In Belief That Boy Was Alive Madhya Pradesh Chambal river
Crocodile, Madhya Pradesh, Chambal river, Stomach, wild animal
Angry villagers Raghunathpur captured a crocodile for over seven hours so that they could recover the body of a 7 year-old boy who they thought the reptile had swallowed! pic.twitter.com/DKxGylYOzP
— Anurag Dwary (@Anurag_Dwary) July 13, 2022