కూరగాయల వ్యాపారి ఖాతాలో 4కోట్లు.. అంతలో - MicTv.in - Telugu News
mictv telugu

కూరగాయల వ్యాపారి ఖాతాలో 4కోట్లు.. అంతలో

July 18, 2019

4 crore in deepak singh's account..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇటావా జిల్లాలోని ఓ కూరగాయల వ్యాపారికి బ్యాంకులో వింత అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే దీపక్ సింగ్ అనే వ్యాపారి అకౌంట్‌లో రూ.4 కోట్లు జమ అయినట్టుగా పాస్ బుక్‌లో ప్రింట్ వచ్చింది. దీంతో ఆ వ్యాపారి ఆనందానికి అవధుల్లేవ్. ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నా అతడి అకౌంట్‌లో కేవలం రూ.39 వేల కంటే ఎక్కువ జమ చేయలేకపోయాడు.

అయితే ఇంత డబ్బు జమకావడంతో దీపక్ సింగ్ ముందుగా ఆనందపడిపోయాడు. అయితే ఈ ఆనందం ఎక్కువ సమయం లేకుండా పోయింది. సర్వర్‌ సమస్య కారణంగా అతడి పాస్ బుక్ తప్పుగా ప్రింట్ అయిందని బ్యాంకు అధికారులు తెలిపారు. ఈ అంశమై దీపక్‌ మాట్లాడుతూ..’ఎస్బిఐకి చెందిన స్థానిక బ్రాంచిలో నాకు అకౌంట్ ఉంది. పాస్‌బుక్ అప్‌డేట్ చేయించుకునేందుకు బ్యాంకు వెళ్ళాను. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన పాస్‌బుక్ చూసిన నాకు కళ్లు తిరిగినంతపనైంది. నా అకౌంట్‌లో రూ.4 కోట్ల జమ అయినా.. పొరపాటున ఇలా జరిగిందని బ్యాంకు అధికారులు చెప్పారు’ అన్నాడు.