CRPF అసిస్టెంట్ కమాండెంట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు అలర్ట్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ (సివిల్ ఇంజనీర్) రిక్రూట్‌మెంట్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లను ఈ రోజు అంటే ఫిబ్రవరి 23, గురువారం నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. CRPF విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, AC సివిల్ ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డ్‌ని 23 ఫిబ్రవరి 2023 నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అభ్యర్థులు, వారు తమ అడ్మిట్ కార్డును అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. crpf.gov.in నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీని కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌ను చెక్ చేయాలి. హోమ్ పేజీలో యాక్టివేట్ చేయబడిన సంబంధిత లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కొత్త పేజీలో అభ్యర్థులు తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత, అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకున్న తర్వాత అభ్యర్థులు సాఫ్ట్ కాపీని కూడా సేవ్ చేయాలి.
అసిస్టెంట్ కమాండెంట్ (సివిల్ ఇంజనీర్) కోసం CRPF అడ్మిట్ కార్డ్ 2023ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అభ్యర్థులు అందులో పేర్కొన్న వారి వివరాలను జాగ్రత్తగా చదవాలి. ఏదైనా వ్యత్యాసం ఉంటే, వెంటనే CRPFను సంప్రదించాలి. అసిస్టెంట్ కమాండెంట్ (సివిల్ ఇంజనీర్) పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం 28 ఫిబ్రవరి 2023న వ్రాత పరీక్ష నిర్వహించాలని CRPF ప్రకటించింది. ఈ పరీక్షకు హాజరు కావడానికి అడ్మిట్ కార్డులు నేటి నుంచి జారీ అయ్యాయి.