కశ్మీర్ లోయలో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రదాడి - MicTv.in - Telugu News
mictv telugu

కశ్మీర్ లోయలో సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహనంపై ఉగ్రదాడి

July 1, 2020

nvhmhg

కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా తరహా దాడికి బుధవారం ఉదయం ప్రయత్నించారు. సీఆర్పీఎఫ్ బలగాల పెట్రోలింగ్ పార్టీపై దాడికి తెగబడ్డారు. సోపోర్‌ ప్రాంతలో తెల్లవారుజామున హఠాత్తుగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీలు చేపట్టారు. 

కొంత కాలంగా ఉగ్రకదలికల నేపథ్యంలో సీఆర్ఫీఎఫ్ బలగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో సోపోర్‌లోని మోడల్‌ టౌన్‌ వద్ద నాకా పార్టీపై ఉగ్రవాదులు  కాల్పులు జరిపారు. ఇద్దరు జవానులతో పాటు ఓ స్థానికుడు గాయపడ్డారు. వెంటనే క్షతగాత్రులను స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని డీజీపీ దిల్బగ్ సింగ్ వెల్లడించారు.