కేంద్రప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కష్టపడుతున్నవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తోపాటు ఇతర పోస్టుల కోసం అభ్యర్థులను రిక్రూట్ చేస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు CRPF అధికారిక వెబ్ సైట్ www.crpfindia.com, crpf.gov.in, www.crpf.nic.in సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1458 ఖాళీలను భర్తీ చేస్తారు. దరఖాస్తులు జనవరి 4, 2023 నుండి ప్రారంభమయ్యాయి. దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ జనవరి 25. మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను చెక్ చేయండి.
మొత్తం 1458 పోస్టుల వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్: 143 పోస్టులు
హెడ్ కానిస్టేబుల్: 1315 పోస్టులు
విద్యా అర్హత:
CRPFలో వివిధ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (10+2) లేదా తత్సమాన పరీక్షను కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:
పైన పేర్కొన్న పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ విధమైన పరీక్షలు ఉంటాయి.
- వ్రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- వివరణాత్మక వైద్య పరీక్ష
వయోపరిమితి :
వివిధ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు చివరి తేదీ నాటికి వయోపరిమితి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతం వివరాలు:
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో వివిధ ఖాళీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నెలవారీ జీతం లభిస్తుంది.
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్కు నెల జీతం రూ. 25,500 – రూ. 81,100
హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు నెలవారీ జీతం రూ. 29,200 – రూ. 92,300 జీతం.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ఫారమ్ ప్రారంభ తేదీ: జనవరి 04,
2023 దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: జనవరి 25, 2023
అడ్మిట్ కార్డ్: ఫిబ్రవరి 15, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించడం: 22-28 ఫిబ్రవరి 2023 మధ్య ఉంటుంది.