సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి - MicTv.in - Telugu News
mictv telugu

సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై ఉగ్రవాదుల దాడి

July 5, 2020

c ncgn

గతేడాది జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 50 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులయ్యారు. తాజాగా ఈరోజు ఉదయం పుల్వామాలోని గంగూ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీ అటాక్ చేశారు. 

ఈ దాడిలో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదులు దాడికి దిగినట్లు భద్రతా అధికారులు తెలిపారు. ఈ దాడి జరిగిన తరువాత సీఆర్పీఎఫ్ జవాన్లకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. సీఆర్పీఎఫ్ జవాన్లు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారని భద్రతా ఉన్నతాధికారులు వెల్లడించారు.