బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా ఆయన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఫ్లోరిడా వెళ్లేందుకు జెట్ బ్లూ ఎయిర్‌లైన్ విమానం ఎక్కాడు. అందులో ఓ యువకుడు మైక్ టైసన్ పట్ల పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు. పదే పదే మాట్లాడుతూ.. మైక్ టైసన్‌కు కోపం తెప్పించాడు. అనంతరం మైక్ టైసన్ తనతో మాట్లాడవద్దని ఆ యువకుడికి చెప్పాడు. అయిన్పటికీ, ఆ యువకుడు అవేమీ వినకుండా విసికించాడు. దీంతో మైక్ టైసన్‌కు విపరీతమైన కోపం వచ్చింది. దాంతో ఆ యువకుడి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు.
దాంతో యువకుడి ముఖం పచ్చడి పచ్చడి అయ్యింది. అనంతరం విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు టైసన్‌ను శాంతింపజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. మరోపక్క వీడియోను వీక్షిస్తున్న నెటిజన్లు యువకుడికి సరైనా బుద్ది చెప్పావ్ మైక్ టైసన్ అని, మరికొందరు యువకుడి పిచ్చి వాగుడుకు సరైన ట్రీట్మెంట్ అదిరిందని కామెంట్స్ మీద కామెంట్స్ చేస్తున్నారు. మరి ఎందుకు ఆలస్యం ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.