శనివారం చెన్నై, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణిత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చేసినప్పటికీ చెన్నైకి ఓటమి తప్పలేదు. ఫా డూ ప్లెసిస్(58), అంబటి రాయుడు(45), రవీంద్ర జడేజా(33)లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ 2, తుషార్, రబడా చెరో వికెట్ తీశారు.
ఢిల్లీ ఆటగాళ్లలో శిఖర్ ధావన్ 58 బంతుల్లో 101 పరుగులు చేసి జట్టుని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఢిల్లీ జట్టు 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నిర్ణిత లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ 2, సామ్, శార్దూల్, బ్రేవో చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ విజయంతో ఢిల్లీ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ ఓటమితో చెన్నైకి ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.