ఈ సీజన్ ధోని నేతృత్వంలోని చెన్నై ఐపీఎల్ జట్టుకి అస్సల్ కలిసి రావడంలేదు. మూడుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన చెన్నై జట్టు ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఇప్పటికే ఈ సీజన్‌కి వ్యక్తిగత కారణాలతో సీనియర్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనాలు టోర్నీ నుంచి తప్పుకున్నారు.
తాజాగా చెన్నై జట్టులోని కీలక ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో గజ్జల్లో గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. గత శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్లో బ్రావో బౌలింగ్ కూడా వేయలేకపోయాడు. దీంతో డాక్టర్లు అతడికి విశ్రాంతి అవసరమని తెలిపారు. ‘ఐపీఎల్ 2020 సీజన్లో బ్రావో ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. గజ్జల్లో గాయంతో అతడు మిగతా మ్యాచ్‌లకు దూరంకానున్నాడు. ఒకటి లేదా రెండు రోజుల్లో స్వదేశానికి తిరిగి వెళ్తాడని’ చెన్నై సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.