కుందేలు తీసుకుని బట్టల సబ్బు ఇవ్వు.. లాక్‌డౌన్ దెబ్బ - MicTv.in - Telugu News
mictv telugu

కుందేలు తీసుకుని బట్టల సబ్బు ఇవ్వు.. లాక్‌డౌన్ దెబ్బ

June 3, 2020

 

rabbits

కరోనా లాక్‌డౌన్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పొట్టకొట్టింది. ఉద్యోగాలు పోయాయి. స్వయం ఉపాధి కూడా దెబ్బతింది. దీంతో పేదజనం చేతులు చాపి మరీ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు. మనదేశంలోనే కాదు, ప్రభుత్వాలు కాస్త ఆదుకునే దేశాల్లోనూ ఇదే పరిస్థితి. దీంతో జనం పాతకాలం నాటి వస్తుమార్పిడి పద్ధతికి మొగ్గుచూపుతున్నారు. 

‘ఇదిగో అబ్బాయ్, ఈ కుందేలును తీసుకుని ఓ బట్టల సబ్బు ఇలా పడేయ్’ అంటున్నాడు క్యూబా రాజధాని హవానాలోని నెల్సన్ అగ్యులర్ అనే వృద్ధుడు. లాక్‌డౌన్ వల్ల పని లేకపోవడంతో అతడు తన ఇంటిపై పెంచుకుంటున్న కుందేళ్లను నిత్యావసరాల కోసం ఇలా మార్చుకుంటున్నాడు. ఆకలేస్తే ఓ రెండు కుందేళ్లను హోటల్ కు తీసుకెళ్లి, ఆహారం తెచ్చుకుంటున్నాడు. సూపర్ మార్కెట్లలతో వస్తువులు లేకపోవడం, ఉన్నా చాంతాడంత క్యూలలో నిలబడి కరోనా సోకించుకోవాలనే ఆశ లేకపోవడంతో నెల్సన్ ఈ బాట పట్టాడు.

మరో మద్యం వ్యాపారి ఏకంగా మద్యాన్ని మార్చుకుని సరుకులు కొంటున్నాడు. ‘ఇప్పుడు డబ్బుతో ప్రయోజనం లేదు. నా వద్ద టాయిలెట్ పేపర్, బంగాళాదుంపలు చాలినన్ని ఉన్నాయి. వాటిని ఇచ్చేసి గోధుమ పిండి, పాలు తెచ్చుకుంటున్నాను.. ’ అని మరో పౌరుడు చెప్పాడు.