వరదలో కొట్టుకుపోయిన కూంబింగ్ జవాన్ల బస్సు..  - MicTv.in - Telugu News
mictv telugu

వరదలో కొట్టుకుపోయిన కూంబింగ్ జవాన్ల బస్సు.. 

September 21, 2020

Cumbing Jawan bus washed away in the flood ...

వరుసగా కురుస్తున్న వర్షాలకు వీధుల్లో వరదలు పొంగుతున్నాయి. ఈ వరదల కారణంగా ప్రజలకు కొత్త ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ఘటనల్లో ఇద్దరు ఓపెన్ నాలాలో కొట్టుకుపోయి మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ బస్సు వరదల్లో చిక్కుకుంది. బీజాపూర్‌లో కూంబింగ్‌కు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు వరదలో కొట్టుకుపోయింది. మల్కన్‌గిరి బీజాపూర్ రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వంతెన మీదుగా బస్సు వస్తుండగా వరద ఉదృతికి బస్సు నీళ్లల్లో కొట్టుకుపోయింది. 

ఎక్కువ దూరం వెళ్లకుండా బస్సు ఓ చోట పక్కకు ఒరిగి ఆగిపోయింది. అలర్ట్ అయిన జవాన్లు బస్సు నుంచి ఒక్కొక్కరు బయటకు దూకేశారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. ఘటన సమయంలో బస్సులో 30 మంది జవాన్లు ఉండగా.. వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. కాగా, ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.