చెత్తకుప్పలో రూ.1.60 లక్షలు..అన్నీకొత్త నోట్లే - MicTv.in - Telugu News
mictv telugu

చెత్తకుప్పలో రూ.1.60 లక్షలు..అన్నీకొత్త నోట్లే

December 4, 2019

Currency 01

వరంగల్ జిల్లా మట్టెవాడలోని హంటర్‌రోడ్డు 12 మోరీల జంక్షన్‌ వద్ద చెత్తకుప్పలో భారీగా నోట్ల కట్టలు లభించాయి. మంగళవారం సాయంత్రం చెత్తకుప్పల్లో చిరిగిపోయిన, చెదలుపట్టిన రూ.1.60 లక్షల విలువైన కొత్త నోట్ల కట్టలను చిత్తు కాగితాలు సేకరించే వారు గమనించి సమీపంలోని ఓ దుకాణ యజమానికి చూపించారు. 

ఆయన పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో రూ.200, రూ.100, రూ.500 నోట్ల కట్టలు ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఈ నోట్ల కట్టలను చెత్తకుప్పల వద్ద పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.