కొంపముంచిన జాగ్రత్త.. కరెన్సీ నోట్లు వాషింగ్ మెషిన్లో పడ్డాక ఇలా..  - MicTv.in - Telugu News
mictv telugu

కొంపముంచిన జాగ్రత్త.. కరెన్సీ నోట్లు వాషింగ్ మెషిన్లో పడ్డాక ఇలా.. 

August 1, 2020

Currency Notes In Washing Machine To Protect Them From COVID-19, Ends Up Damaging Them

కరోనా వైరస్ రాకుండా ప్రజలు చాలా చాలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చేతులు కడుక్కోవడం నుంచి  మొత్తం పీపీఈ కిట్ అవతారం వరకు చాలా జాగ్రత్త పడుతున్నారు. చివరకు ఆకుకూరలను కూడా బట్టలకు బ్రష్ పెట్టినట్లు తోమిపారేస్తున్నారు. కరెన్సీ నోట్ల ద్వారా కూడా కరోనా వస్తుందని ప్రచారం సాగడంతో కొందరు వాటిని నీటిలో కడిగి ఆరబెడుతున్నారు. ఓ ప్రబుద్ధుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా వాషింగ్ మెషిన్లోనే వాటిని శుభ్రం చేశాడు. ఫలితం చూసి కుయ్యోమెర్రో అన్నాడు.

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల చనిపోయాడు. కరోనా మహమ్మారి కాలం కావడంతో బంధుమిత్రులు ఆ కుటుంబానికి ఐదూ పది లెక్కన మొత్తం 42 డాలర్ల( రూ.3,137) సాయం చేశారు. అయితే ఆ నోట్లకు కరోనా వైరస్ అంటుకుని ఉంటుందేమోనన్న అనుమానంతో ఇంట్లోని ఓ వ్యక్తి వాటిని మొదట కడగాలని అనుకున్నాడు. వాషింగ్ మెషిన్లో పడేస్త మరింతా శుభ్రం అవుతాయని సర్ఫ్ వేసి చితగ్గొట్టాడు. రెండు మూడు రౌండ్లు తిప్పి డోర్ తెరిచాడు. కొన్ని నోట్లు ముద్దలుగా మారిపోయి వెక్కింరించాయి. అయినా ఆశ చావకుండా కొన్నింటిని జాగ్రత్తగా మైక్రోవేవ్ చేశాడు. బొక్కలుపడ్డ నోట్లను ఎవరూ తీసుకోరని, బ్యాంకులో తీసుకుంటారని వెళ్లాడు. అయితే అంతగా చివికిపోయిన వాటిని తామూ తీసుకోలేమని బ్యాంకు సిబ్బంది చేతులెత్తేశారు.  కాళ్లావేళ్లా పడగా నంబర్లు చెరిగిపోని వాటిని తీసుకుని రూ. 1500 చేతిలో పెట్టి పంపారు.