పండగ చేసుకున్నారు... రోడ్డుపైన నోట్ల వర్షం.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పండగ చేసుకున్నారు… రోడ్డుపైన నోట్ల వర్షం.. (వీడియో)

July 11, 2019

రోడ్డుపైన పది రూపాయలు కనిపిస్తే చప్పున తీసుకుని జేబులో వేసుకుంటాం. మరి అలాంటిది ఏకంగా కట్టలకొద్దీ నోట్ల వర్షమే కురిస్తే! ఏవో ప్లాంపేట్లలా గాలికి వరదలా వచ్చేస్తే! అచ్చం అలాంటి దృశ్యం అక్కడ కనిపించింది. దాదాపు కోటికిపైగా రోడ్లపైన పారింది. పాదచారులు, కారుదారులు.. అందరూ వాటిని లటుక్కున ఏరుకుని చక్కా పోయారు. అమెరికాలోని జార్జియా రాష్ట్ర రాజధాని అట్లాంటాలో బుధవారం సాయంత్రం జరిగిందీ సంఘటన. 

ఆర్మీ లారీలో 1.75 లక్షల డాలర్లు(రూ. 1.10 కోట్లను)ను తీసుకెళ్తుండగా, వెనక తలుపు తెరుచుకోవడంతో నోట్ల కట్టలు రోడ్లపైన పడిపోయాయి. దీనికి తోడు గాలిదుమారం కూడా లేచింది. ఆ రోడ్డంతా నోట్లు కొట్టుకుంటూ పోయాయి. జనం కార్లు దిగి మరీ డబ్బు ఏరుకుని జేబుల్లో వేసకున్నారు. ఫోన్లు చేసి దగ్గర్లోని వారికి విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న ఆర్మీ సిబ్బంది తేరుకునే లోపే నోట్లు జనం జేబుల్లోకి వెళ్లిపోయాయి. అక్కడక్కగా పడిన కొంత మొత్తాన్ని ఏరుకుని ఏడుపు ముఖాలతో వెళ్లిపోయాయి. తాము తీసుకెళ్తున్న డబ్బులో కొంత మాత్రమే తిరిగి దక్కిందని బెక్కారు.