పెళ్లిసందట్లో రూ. 500 నోట్ల వర్షం.. (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

పెళ్లిసందట్లో రూ. 500 నోట్ల వర్షం.. (వీడియో)

December 4, 2019

Currency 0002 

గుజరాత్ రాష్ట్రంలో ఉన్నట్టుండి నోట్ల వర్షం కురిసింది.  ఓ బడా వ్యాపారి కుటుంబంలో పుట్టిన రుషిరాజ్‌ జడేజా వివాహం సందర్భంగా జరిగిన ఊరేగింపులో జనంపైకి డబ్బులు వెద జల్లారు. రూ. 500,రూ.200,రూ.100 నోట్ల కట్టలు తీసుకొని పైకి చల్లుతూ డ్యాన్స్ చేశారు. దీన్ని చూసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. చాలా మంది వాటిని ఎగబడి మరీ ఏరుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వధూ వరులను జామ్‌నగర్‌ నుంచి చేలాకు తీసుకువెళ్లేందుకు ఏకంగా హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. గ్రామంలోకి వచ్చిన తర్వాత వారు కారులో ఊరేగింపుగా వెళ్లారు. ఆ సమయంలో జరిగిన బరాత్‌లో జనాలపైకి వరుడి కుటుంబ సభ్యులు డబ్బులు చల్లారు. కారుపైకి ఎక్కి చేతికి నోట్ల కట్టలు తీస్తూ పైకి విసిరారు. వీటి విలువ సుమారు రూ.90 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇలా ప్రజలపైకి డబ్బు వెదజల్లడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే రుషిరాజ్‌ జడేజా ఖరీదైన కార్లు, హార్స్‌ రైడింగ్‌ వంటి అంశాల్లోనూ ఇది వరకు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశాడు. తాజాగా ఇలా కరెన్సీ వర్షం కురిపించడంతో మరోసారి వైరల్‌గా మారాడు.