బాలీవుడ్ విలన్‌కు షాకిచ్చిన కరెంట్ బిల్లు - MicTv.in - Telugu News
mictv telugu

బాలీవుడ్ విలన్‌కు షాకిచ్చిన కరెంట్ బిల్లు

June 30, 2020

ngnvbn

విద్యుత్ బిల్లులు ముట్టుకుంటేనే షాక్ ఇస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరికీ దిమ్మతిరిగిపోయే స్థాయిలో బిల్లులు వస్తున్నాయి. ఇటీవల చాలా మంది సెలబ్రెటీలు కరెంట్ బిల్లు తీసుకొని షాక్ అయ్యారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు అశుతోష్ రాణాకు కూడా తప్పలేదు. నెల రోజూలోనే భారీగా బిల్లు రావడం చూసి ఆయన భార్య రేణుకా సహానే మండిపడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తనకు వచ్చిన బిల్లు వివరాలను రేణుకా ముంబైలోని అదానీ ఎలక్ట్రిసిటీని ట్యాగ్ చేశారు. మే 9వ తేదీకి ముందు తమ ఇంటికి రూ. 5,510 బిల్లు వస్తే అది మే చివరి నాటికి రూ.18,083కు చేరింది. ఇక జూన్ నెల వచ్చే సరికి ఏకంగా  తాజాగా బాలీవుడ్, టాలీవుడ్‌లలో విలన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన అశుతోష్‌రాణా భార్య, నటి రేణుకా సహానే తప్పుడు బిల్లులపై మండిపడ్డారు. రూ. 29700 రావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల ఇంతగా ఎలా పెరుగుతోందని ప్రశ్నించారు. ఇప్పటికే అధికారుల తీరుపై నగరవాసులు మండిపడుతున్న సమయంలో సెలబ్రెటీలు కూడా చేరడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.