ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం కరెంట్ కోతలను మొదలుపెట్టిందని ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు కరెంటు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఒకవైపు ల్యాప్‌టాప్‌కు ఛార్జింగ్ లేక, మరోవైపు వైఫై రాక తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో కరెంట్ కట్ చేస్తున్న ప్రభుత్వ అధికారులపై తీవ్రంగా మండిపడుతూ, కరెంట్‌ను కట్ చేయొద్దంటూ వేడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం విద్యుత్ కోతలతో ఏపీ విలవిల్లాడుతోందని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్రంలోని అన్ని రంగాలు కూడా తీవ్రంగా నష్టపోతున్నాయని, ఇప్పటికైనా ఉన్నతాధికారులతో సమీక్షించి పవర్ హాలిడేలను ఎత్తివేయాలని జగన్ మోహన్ రెడ్డిని కోరారు. అంతేకాకుండా జగన్‌కు నారా లోకేశ్ ఓ లేఖ కూడా రాశారు. కాసేపటి క్రితం వరుసగా ట్వీట్లు చేసిన లోకేశ్ .. విద్యుత్ కోతలతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు.